Home Loan: బ‌జాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గృహ రుణ ఆఫర్‌ పొడిగింపు

సిబిల్‌ స్కోర్‌ ఎక్కువ ఉన్నవారు ఆఫర్‌ కింద గృహరుణం పొందేందుకు అర్హులు.

Updated : 18 Feb 2022 17:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ నూతన సంవత్సరం సందర్భంగా గృహ రుణాలు తీసుకునేవారి కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. అధిక క్రెడిట్‌ స్కోర్‌ ఉన్నవారికి కనిష్ఠంగా 6.65 శాతం వడ్డీరేటుతో రుణాలు అందజేస్తున్నట్లు తెలిపింది. 2022 జ‌న‌వ‌రి 26 వ‌ర‌కు త‌మ వెబ్‌సైట్ ద్వారా ద‌రఖాస్తు చేస్తున్న వారికి ఈ వ‌డ్డీ రేటుతో రుణాలు అందిస్తామ‌ని గ‌తంలో తెలిపింది. అయితే, తాజాగా ఈ ఆఫ‌ర్ గ‌డువు తేదీని ఫిబ్రవరి 28 వ‌ర‌కు పొడిగించింది.

సిబిల్‌ స్కోర్‌ 800 కంటే ఎక్కువ ఉన్నవారు ఆఫర్‌ కింద గృహరుణం పొందడానికి అర్హులని కంపెనీ ప్రకటించింది. 750-799 మధ్య స్కోర్‌ ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. రూ.5 కోట్ల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. వీరికి వడ్డీరేటు స్వల్పంగా అధికంగా ఉంటుందని పేర్కొంది. ఇక ఇతర సంస్థల్లో హోంలోన్ ఉన్నవారు తమ సంస్థకు బదిలీ చేసుకోవచ్చని తెలిపింది. అలాంటి వారికి టాప్‌-అప్‌ కింద రూ.1 కోటి అదనపు రుణాన్ని మంజూరు చేస్తామని ప్రకటించింది. అలాగే, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) కింద వడ్డీరేటులో రాయితీ కూడా పొందే అవకాశం ఉందని తెలిపింది.
ప్రభుత్వ రంగ సంస్థల్లో లేదా బహుళజాతి కంపెనీల్లో పనిచేసే వేతన జీవులు కూడా ఈ ఆఫర్‌ కింద రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చని బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తెలిపింది. కనీసం మూడేళ్ల అనుభవం ఉన్న ఎంబీబీఎస్ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత గల వైద్యులు సహా చార్టెడ్‌ అకౌంటెంట్లు కూడా ఆఫర్‌ పొందవచ్చునని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని