Bank Holidays in 2023: కొత్త ఏడాదిలో బ్యాంకు సెలవులు ఇవే..
Bank Holidays list: బ్యాంకులకు 2023లో చాలా సెలవులు రానున్నాయి. శని, ఆదివారాలను మినహాయిస్తే పండగల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో 20 రోజులకు పైగా బ్యాంకు శాఖలు మూతపడనున్నాయి.
ఇంటర్నెట్‌డెస్క్: ఒకప్పుడు బ్యాంక్‌కు వెళ్లనిదే పనులు జరిగేవి కావు. సాంకేతికత అందుబాటులోకి వచ్చాక ఇప్పుడు మెబైల్‌లోనే దాదాపు అన్ని ఆర్థిక కార్యకలాపాలూ జరిగిపోతున్నాయి. ఖాతా తెరవడం దగ్గర నుంచి ఇతరులకు నగదు పంపించడం వరకు చాలా పనులు దీంతోనే చెక్కబెట్టేస్తున్నారు. అయితే, బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవాలన్నా, లాకర్‌లో వస్తువులు దాయాలన్నా బ్యాంకులకు వెళ్లాల్సిందే. అయితే, ఏదైనా పని మీద బ్యాంకుకు వెళ్లాల్సి వస్తే.. ముందుగా ప్లాన్ చేసుకోవాలి. తీరా ఆ రోజు సెలవు అని తెలిస్తే ఇబ్బంది పడాల్సి రావొచ్చు. కాబట్టి బ్యాంకు శాఖలు పనిచేసే రోజులు తెలుసుకోవాలి. తాజాగా కొత్త ఏడాదికి సంబంధించి ఆర్‌బీఐ సెలవు తేదీలను ప్రకటించింది. సంక్రాంతి, మహా శివరాత్రి, దీపావళి వంటి పండగలు, ఆదివారాలు, ప్రతి నెలా రెండో, నాలుగో శనివారం బ్యాంకులు పనిచేయవు. ఆయా రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆయా స్థానిక పండగలకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఇతర రాష్ట్రాల్లో ఈ తేదీల్లో మార్పులుంటాయి.
2023లో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకు సెలవులివే..
- జనవరి 15 (ఆదివారం) - సంక్రాంతి
- జనవరి 26 (గురువారం) - గణతంత్ర దినోత్సవం
- ఫిబ్రవరి 18 (శనివారం) - మహాశివరాత్రి
- మార్చి 07 (మంగళవారం) - హోలీ
- మార్చి 22 (బుధవారం)- ఉగాది
- మార్చి 30 (గురువారం)- శ్రీరామనవమి
- ఏప్రిల్ 01 (శనివారం) - ఆర్థిక వార్షిక సంవత్సర ప్రారంభం
- ఏప్రిల్ 05 (బుధవారం)- జగ్జీవన్‌రాం జయంతి
- ఏప్రిల్ 07 (శుక్రవారం) - గుడ్ ఫ్రైడే
- ఏప్రిల్ 14 (శుక్రవారం) - అంబేడ్కర్ జయంతి
- ఏప్రిల్ 22 (శనివారం) - రంజాన్
- మే 01 (సోమవారం) - మే డే
- జూన్ 29 (గురువారం) - బక్రీద్
- జులై 29 (శనివారం)- మొహర్రం
- ఆగస్టు 15 (మంగళవారం)- స్వాతంత్య్ర దినోత్సవం
- సెప్టెంబర్ 07 (గురువారం) - శ్రీ కృష్ణాష్టమి
- సెప్టెంబర్ 18 (సోమవారం) - వినాయక చవితి
- సెప్టెంబర్ 28 (గురువారం) - మిలాద్- ఉన్- నబి
- అక్టోబర్ 02 (సోమవారం) - మహాత్మా గాంధీ జయంతి
- అక్టోబర్ 24 (మంగళవారం) - విజయదశమి
- నవంబర్ 12 (ఆదివారం) - దీపావళి
- నవంబర్ 27 (సోమవారం) - కార్తీక పౌర్ణమి/గురునానక్ జయంతి
- డిసెంబర్ 25 (సోమవారం)- క్రిస్మస్
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
wWBC: నిఖత్ జరీన్ పసిడి పంచ్..!
-
India News
Rahul Gandhi: ట్విటర్ బయోను మార్చిన రాహుల్
-
Politics News
Kishan Reddy: తెలంగాణలో మార్పు తీసుకువచ్చే వరకు పోరాటం: కిషన్ రెడ్డి
-
Movies News
ss karthikeya: ‘RRR’ ఆస్కార్ క్యాంపెన్ ఖర్చు ఇదే.. విమర్శకులకు కార్తికేయ కౌంటర్!
-
Politics News
Revanth Reddy: భాజపా నేతలపై కేసుల్లేవా.. వారికి శిక్షలేవి?: రేవంత్ రెడ్డి
-
World News
Planes Collide: తప్పిన పెను ప్రమాదం.. గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి..!