Bank Holidays in March: మార్చి నెలలో బ్యాంక్‌ సెలవులివే..

Bank holidays in march:  మార్చి నెలలో మొత్తం 13 రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి.  

Published : 01 Mar 2022 02:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏటీఎం కేంద్రాలు, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులో ఉన్నా ఇప్పటికీ కొన్ని పనుల కోసం బ్యాంకులకు వెళ్లాల్సిందే. రుణాలు తీసుకోవడం, బంగారం తాకట్టు పెట్టడం, లాకర్‌ వినియోగించుకోవడం తదితర పనుల కోసం బ్యాంకులను ఆశ్రయించాల్సి ఉంటుంది. ఒకవేళ పొరపాటున సెలవు దినాల్లో బ్యాంక్‌కు వెళితే.. ఆ రోజు ప్రణాళిక అంతా దెబ్బతింటుంది. కాబట్టి బ్యాంకులు ఏయే రోజుల్లో పనిచేయవో తెలుసుకోవడం ముఖ్యం. అయితే ఆర్‌బీఐ వెలువరించిన సెలవుల జాబితా ప్రకారం.. మార్చి నెలలో మొత్తం 13 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. అయితే, ఆయా రాష్ట్రాలను బట్టి సెలవుల్లో మార్పులు ఉంటాయి.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే మార్చి నెలలో మహాశివరాత్రి, హోలీ వంటి ప్రధాన పండగలు ఉన్నాయి. దీంతో ఆయా రోజుల్లో బ్యాంకులు పనిచేయవు. దీనికి తోడు రెండో, నాలుగో శనివారాలు, నాలుగు ఆదివారాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. అంటే ఆరు సాధారణ సెలవులు, రెండు పండగ సెలవులు కలుపుకొని తెలుగు రాష్ట్రాల్లో మార్చి నెలలో 8 రోజులు బ్యాంకులు పనిచేయవు. మిగిలిన రాష్ట్రాల్లో ఆయా స్థానిక పండగలకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఈ తేదీల్లో మార్పులుంటాయి.

బ్యాంకులు పనిచేయని రోజులు..

  • మార్చి 01 (మంగళవారం) - మహా శివరాత్రి
  • మార్చి 06 - ఆదివారం
  • మార్చి 12 (శనివారం) - రెండో శనివారం
  • మర్చి 13 - ఆదివారం
  • మార్చి 18 (శుక్రవారం) - హోలీ
  • మార్చి 20 - ఆదివారం
  • మార్చి 26 - నాలుగో శనివారం
  • మార్చి 27 - ఆదివారం
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని