కారు కొనుగోలుకు వివిధ బ్యాంకుల వ‌డ్డీ రేట్లు

చాలా బ్యాంకులు త‌మ రుణ రేట్ల‌ను క్రెడిట్ స్కోర్‌ల‌తో అనుసంధానించాయి.

Updated : 26 Apr 2022 18:08 IST

ప్ర‌స్తుత కాలంలో మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారు కూడా ఇద్ద‌రు కంటే ఎక్కువ మంది ప్ర‌యాణించ‌డానికి కారునే అనువైన వాహ‌నంగా ఉప‌యోగిస్తున్నారు. కారును కొనుగోలు చేయ‌డానికి చేతిలో త‌గినంత న‌గ‌దు లేకున్నా..బ్యాంకు అందించే కారు రుణాలు తీసుకోవ‌చ్చు. బ్యాంకులు కూడా ఈ రుణాలను విరివిగా అంద‌చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు త‌మ ఎంచుకున్న వినియోగ‌దారుల‌కు 'ప్రీ-అప్రూవ్డ్' కారు రుణాలు లేదా వారి ప్ర‌స్తుత గృహ రుణ గ్ర‌హీత‌ల‌కు ప్రత్యేక రేట్ల‌ను కూడా అందిస్తున్నాయి.  మెరుగైన రుణాన్ని పొంద‌డానికి మీరు వేర్వేరు బ్యాంకులు అందించే కారు రుణ ఆఫ‌ర్ల‌ను పోల్చి చూసుకోవాలి. 

కారు రుణాల‌పై వ‌ర్తించే వ‌డ్డీ రేట్లు మీ క్రెడిట్ స్కోర్‌, మీ వ్య‌క్తిగ‌త ఆదాయాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న త‌ర్వాత నిర్ణ‌యించ‌బ‌డ‌తాయి. చాలా బ్యాంకులు త‌మ రుణ రేట్ల‌ను క్రెడిట్ స్కోర్‌ల‌తో అనుసంధానించాయి. కాబ‌ట్టి  750 లేదా అంత‌కంటే ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న వారు త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌కు రుణం పొందుతారు. త‌క్కువ క్రెడిట్ స్కోర్ క‌లిగి ఉన్న‌వారు కారు రుణం పొంద‌లేక‌పోవ‌చ్చు లేదా రుణానికి అధిక వ‌డ్డీని వ‌సూలు చేయ‌బ‌డ‌వ‌చ్చు. అందుచేత కారు రుణానికి ముందే మీ క్రెడిట్ నివేదిక‌ల‌ను త‌నిఖీ చేసుకోవాలి. రుణంతో మీ బ‌డ్జెట్ కి అనుగుణ‌మైన కారుని ఇంటికి తీసుకురావ‌చ్చు. కారు విలువ త‌గ్గే ఆస్తి కాబ‌ట్టి, వ‌డ్డీ చెల్లింపును త‌గ్గించుకోవ‌డానికి త‌క్కువ కాల‌వ్య‌వ‌ధిలో తీర్చివేసే రుణాన్ని ఎంచుకుంటే మంచిది.

ప్ర‌స్తుతం దేశంలో అతి త‌క్కువ కారు రుణ వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తున్న ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ రంగ బ్యాంకుల జాబితా దిగువ ప‌ట్టిక‌లో ఉంది. ఈ ప‌ట్టిక‌లో 3, 5 సంవ‌త్స‌రాల కాల వ్య‌వ‌ధికి రూ. 7.50 ల‌క్ష‌ల కారు రుణానికి సంబంధించిన ఈఎమ్ఐలు ఉన్నాయి.

ఈ డేటా 18 ఏప్రిల్ 2022 నాటిది.

గ‌మ‌నికః

రుణ మొత్తంతో సంబంధం లేకుండా బ్యాంకులు అందించే అత్య‌ల్ప వ‌డ్డీ రేటు చూప‌బ‌డింది. పట్టిక లో పేర్కొనబ‌డిన రూ. 7.50 ల‌క్ష‌లే కాకుండా ఎక్కువ/త‌క్కువ‌ రుణం కూడా రుణ అర్హ‌త‌ను బ‌ట్టి తీసుకోవ‌చ్చు. పట్టికలో పేర్కొన్న వ‌డ్డీ రేటు ఆధారంగా `ఈఎంఐ` లెక్కించ‌బ‌డుతుంది. పట్టికలోని `ఈఎమ్ఐ`లో ప్రాసెసింగ్ ఫీజులు, ఇత‌ర చార్జీలు క‌ల‌ప‌బ‌డ‌లేదు. పట్టికలో ఉన్న వ‌డ్డీ రేటు సూచిక మాత్ర‌మే. నియ‌మ‌, నిబంధ‌న‌లను బట్టి వ‌డ్డీ రేటు మార‌వ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని