Two wheeler Loans: ద్విచక్ర వాహన రుణాలు.. ఏ బ్యాంకులో ఎంత వడ్డీ?

ఈ ద్విచ‌క్ర వాహ‌నాల రుణాలు 6.85% వ‌డ్డీ రేటుతో ప్రారంభ‌మ‌వుతున్నాయి.

Updated : 08 Jan 2022 15:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ వివిధ వేరియంట్ల రూపంలో విరుచుకుప‌డుతున్న వేళ ఆరోగ్య భద్రత దృష్ట్యా వ్యక్తిగత వాహనాలను వాడడానికి ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. దీనికి తోడు సొంత వాహనం కలిగి ఉంటే సమయం కూడా ఆదా అవుతుంది. అందులోనూ ఎక్కువ మంది ద్విచక్ర వాహన కొనుగోళ్లకే ఇష్టపడుతున్నారు. అలాంటి వారి కోసం చాలా బ్యాంకులు ఆకర్షణీయ వడ్డీ రేట్లకు రుణాలు అందిస్తున్నాయి. త్వరితగతిన ప్రాసెస్‌ కూడా చేస్తున్నాయి.

ఉద్యోగాలు చేసేవారు, క్రెడిట్ స్కోర్ 750 దాటి ఉన్న వారు, ఇతర అర్హత ప్రమాణాలు ఉన్నవారు ద్విచ‌క్ర వాహన రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు త‌క్కువ వ‌డ్డీ రేట్లకే రుణాలు పొందే అవ‌కాశం ఉంటుంది. మోటారు వాహన డీల‌ర్లు కూడా వివిధ రుణ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని వినియోగ‌దారుల‌కు రుణాల‌పై ద్విచ‌క్ర వాహ‌నాల‌ను అంద‌జేస్తున్నారు. ఈ రుణాలు 6.85% వ‌డ్డీ రేటుతో ప్రారంభ‌మ‌వుతున్నాయి. త‌క్కువ ఈఎంఐలతో నెల నెలా రుణాన్ని తీర్చేయొచ్చు.

రుణం తీసుకునేటప్పుడు ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీపేమెంట్ ఛార్జీలు, వ్యవధిని కూడా చెక్‌ చేయాలి. చాలా బ్యాంకులు మంచి ఫైనాన్షియ‌ల్ ట్రాక్ రికార్డ్‌ ఉన్న వినియోగదారులకు ప్రీ-అప్రూవ్డ్ రుణాల‌ను అందిస్తున్నాయి. ఒకవేళ మీరు కూడా ద్విచక్ర వాహన రుణాన్ని తీసుకోవాలని చూస్తుంటే అతి తక్కువ వడ్డీ రేట్లకే రుణాలను అందిస్తున్న బ్యాంకుల జాబితా ఇక్కడ ఇస్తున్నాం. రూ.75 వేల రుణానికి మూడేళ్ల ఈఎంఐ వివరాలను ఇక్కడ పొందు పరుస్తున్నాం.

నోట్‌: ఈ డేటా 2022 జ‌న‌వ‌రి 4 నాటిది. ఇక్కడ ఆయా బ్యాంకులు అందించే అత్యల్ప వడ్డీ రేట్లను మాత్రమే ఇస్తున్నాం. మీ వయసు, ఆదాయం, క్రెడిట్‌ స్కోరు మొదలైన అంశాల ఆధారంగా వడ్డీ రేట్ల్లలో మార్పు ఉండొచ్చు. ఈఎంఐలో ప్రాసెసింగ్‌ ఫీజు, ఇతర ఛార్జీలు కలపలేదు. ఇతర షరతులు, నిబంధనలు వర్తిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని