Loans: గృహ రుణ వడ్డీ రేట్లను పెంచిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా

ఆర్‌బీఐ రెపోరేటును 25 బేసిస్‌ పాయింట్లు(BPS) పెంచిన తర్వాత బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా గృహ రుణాలపై వడ్డీ రేటును సవరించింది.

Published : 09 Feb 2023 17:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్‌బీఐ రెపో రేటు పెంచిన ఒక రోజు తర్వాత.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తన గృహ రుణ వడ్డీ రేట్లను పెంచింది. అన్ని రిటైల్‌ రుణ ఉత్పత్తులకు ఈ బ్యాంకు రెపో లింక్డ్‌ లెండింగ్‌ రేటు (BRLLR)ను అమలు చేసింది. కొత్త రుణ రేట్లు 2023 ఫిబ్రవరి 9 నుంచి అమల్లోకి వస్తాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వెబ్‌సైట్‌ ప్రకారం రిటైల్‌ రుణాలకు వర్తించే BRLLR 9.10% నేటి నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుత ఆర్‌బీఐ రెపోరేటు 6.50%. వడ్డీ రేటును MCLR నుంచి BRLLRకు మార్చడానికి 'BOB' బ్రాంచ్‌ను సంప్రదించాలి.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బేస్‌ రేటు (సంవత్సరానికి) 9.15%. ఇప్పటికే ఉన్న అన్ని ఖాతాలకు BPLR సంవత్సరానికి 13.45%. ఇది 2023 జనవరి 12 నుంచి అమల్లోకి వచ్చింది. రుణ పరిమితి, దరఖాస్తుదారుని సిబిల్‌ స్కోరు రెండూ వడ్డీ రేటును ప్రభావితం చేస్తాయి. తాజా సవరణ తర్వాత MCLR ఓవర్‌నైట్‌ కాలవ్యవధికి 7.50 నుంచి 7.85 శాతానికి పెరిగింది. ఒక సంవత్సరం కాలవ్యవధికి MCLR 8.30 నుంచి 8.50 శాతానికి పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని