Deposits: ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెంచిన బీఓబీ

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ప్రత్యేక పథకాలైన బరోడా తిరంగా 444 రోజులు, 555 రోజుల డిపాజిట్ల గడువు ఈ నెలాఖరు వరకే ఉన్నాయి.

Published : 27 Dec 2022 20:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచింది. ఇప్పుడు సీనియర్‌ సిటిజన్లు 7.55% వరకు పొందొచ్చు. సాధారణ డిపాజిటర్లకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఉన్న డిపాజిట్లపై 3-7.05% మధ్య వడ్డీ రేటును అందిస్తుంది. ఎన్‌ఆర్‌ఓ, ఎన్‌ఆర్‌ఈ టర్మ్‌ డిపాజిట్లతో సహా దేశీయ రిటైల్‌ టర్మ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను వివిధ కాలవ్యవధులకు 65 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచినట్లు బ్యాంకు తెలిపింది. ఈ బ్యాంకు ప్రత్యేక పథకం 'బరోడా తిరంగా ప్లస్‌ డిపాజిట్‌' స్కీమ్‌పై కూడా వడ్డీ రేట్లను పెంచింది. దీనిపైపై గరిష్ఠంగా 7.55% వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. 3-5 సంవత్సరాల పైబడిన రిటైల్‌ టర్మ్‌ డిపాజిట్ల , సినియర్‌ సిటిజన్లు 65 బేసిస్‌ పాయింట్లు అదనంగా పొందుతారు. 5-10 సంవత్సరాల పైబడిన రిటైల్‌ టర్మ్‌ డిపాజిట్లపై సీనియర్‌ సిటిజన్లు 100 బేసిస్‌ పాయింట్లు అదనంగా పొందుతారు.

సాధారణ డిపాజిటర్లకు, సీనియర్‌ సిటిజన్లకు.. సవరించిన వడ్డీ రేట్లు ఈ కింది పట్టికలో ఉన్నాయి.

*ఈ వడ్డీరేట్లు రూ.2 కోట్లలోపు డిపాజిట్లకు వర్తిస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు