బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ATM కేంద్రాల్లో ఇక యూపీఐతో క్యాష్‌

Bank of Baroda UPI cash facility: యూపీఐ యాప్స్‌ ద్వారా క్యాష్‌ విత్‌ డ్రా చేసుకునే సదుపాయాన్ని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తీసుకొచ్చింది. ఇతర బ్యాంకుల కస్టమర్లూ ఈ సేవలను వినియోగించుకోవచ్చు.

Published : 06 Jun 2023 01:15 IST

దిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (Bank of baroda) యూపీఐ ద్వారా క్యాష్‌ విత్‌ డ్రా (Cash withdraw) చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ఇంటరాపరేబుల్‌ కార్డ్‌లెస్‌ క్యాష్‌ విత్‌డ్రా (ICCW) సదుపాయాన్ని తీసుకొచ్చినట్లు ప్రకటించింది. దీని ద్వారా వినియోగదారులు ఆయా ఏటీఎం కేంద్రాల్లో యూపీఐను ఉపయోగించి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇతర బ్యాంకుల కస్టమర్లు సైతం ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.

యూపీఐ ద్వారా క్యాష్‌ విత్‌ డ్రా సదుపాయాన్ని తీసుకొచ్చిన తొలి ప్రభుత్వరంగ బ్యాంక్‌ తమదేనని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తెలిపింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో పాటు ఇతర బ్యాంకుల కస్టమర్లు సైతం ఈ సేవలను వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఇందుకోసం ఏటీఎం కేంద్రాల్లో తొలుత ‘క్యాష్‌ విత్‌డ్రా’ సదుపాయాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అక్కడ కనిపించే క్యూఆర్‌ కోడ్‌ను మొబైల్‌ నుంచి ఏదైనా యూపీఐ యాప్‌ (గూగుల్‌ పే, ఫోన్‌ పే) ద్వారా స్కాన్‌ చేసి క్యాష్‌ మొత్తం, పిన్‌ ఎంటర్‌ చేయడంతో లావాదేవీ పూర్తి చేయొచ్చు.

ఒకవేళ యూపీఐ ఐడీతో ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్‌ ఖాతాలు అనుసంధానం అయ్యి ఉంటే ఏ బ్యాంక్‌ నుంచి అమౌంట్‌ కట్‌ అవ్వాలనేది కస్టమర్‌ ఎంచుకోవచ్చు. రోజులో రెండుసార్లు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి వీలుంటుందని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తెలిపింది. ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.5 వేలు వరకు విత్‌ డ్రా చేయొచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న 11వేల బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఏటీఎం కేంద్రాల్లో ఈ సేవలను వినియోగించుకోవచ్చు. ఈ సదుపాయాన్ని అన్ని బ్యాంకులూ తీసుకురావాలని గతంలో ఆర్‌బీఐ ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని