Banking frauds: గణనీయంగా తగ్గిన బ్యాంకు మోసాలు

రూ.100 కోట్లు ఆపై విలువ చేసే బ్యాంకు మోసాలు 2021-22లో గణనీయంగా తగ్గాయి....

Updated : 03 Jul 2022 18:11 IST

దిల్లీ: రూ.100 కోట్లు ఆపై విలువ చేసే బ్యాంకు మోసాలు 2021-22లో గణనీయంగా తగ్గాయి. క్రితం ఏడాది రూ.1.05 లక్షల కోట్లుగా ఉన్న మోసాల మొత్తం రూ.41,000 కోట్లకు దిగొచ్చాయి. అధికారిక గణాంకాల ప్రకారం అదే సమయంలో మోసాల సంఖ్య సైతం 265 నుంచి 118కి తగ్గాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మోసాల కేసులు 167 నుంచి 80కి, ప్రైవేటు బ్యాంకుల్లో 98 నుంచి 38కి తగ్గాయి. 

మోసాలను కట్టడి చేయడం కోసం ఆర్‌బీఐ పలు పటిష్ఠ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ‘ఎర్లీ వార్నింగ్‌ సిస్టం’ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ‘ఫ్రాడ్‌ గవర్నెన్స్‌ అండ్‌ రెస్పాన్స్‌ సిస్టం’ను బలోపేతం చేయడం, ‘డేటా అనాలిసిస్‌’ను మెరుగుపరచడం వంటి చర్యలు మోసాల కట్టడికి దోహదం చేశాయి. ఈ వ్యవస్థల పనితీరుపై గత ఏడాది ఆర్‌బీఐ పలు బ్యాంకుల్లో సమీక్ష కూడా నిర్వహించింది.

ఈ ఏడాది ఆరంభంలో ఏబీజీ షిప్‌యార్డ్‌, దాని ప్రమోటర్లకు సంబంధించిన రూ.22,842 కోట్ల మోసాన్ని ఎస్‌బీఐ గుర్తించిన విషయం తెలిసిందే. ఇది పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు నీరవ్‌ మోదీ, మెహుల్‌ ఛోక్సీ కలిపి చేసిన రూ.14,000 కోట్ల మోసం కంటే అధికం. మరోవైపు గత నెల డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, దాని మాజీ ప్రమోటర్లు రూ.34,615 కోట్ల బ్యాంకు మోసానికి పాల్పడినట్లు సీబీఐ కేసు నమోదు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని