బ్యాంకులతో ఎదురయ్యే సమస్యల పరిష్కారం

రోజువారీ అవసరాలకు ప్రతి ఒక్కరూ వివిధ రకాల బ్యాంకింగ్ లావాదేవీలు జరుపుతుంటారు. ఆర్థిక లావాదేవీలతోపాటు బ్యాంకులు వివిధ రకాల ఆర్థికేతర సేవలనూ అందిస్తున్నాయి. ఈ లావాదేవీలు, సేవలకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఏర్పడినా, లోపాలు ఉన్నా వాటిని పరిష్కరించుకునే విధానం తెలుసుకోవడం అవసరం.

Updated : 13 Jul 2021 19:54 IST

రోజువారీ అవసరాలకు ప్రతి ఒక్కరూ వివిధ రకాల బ్యాంకింగ్ లావాదేవీలు జరుపుతుంటారు. ఆర్థిక లావాదేవీలతోపాటు బ్యాంకులు వివిధ రకాల ఆర్థికేతర సేవలనూ అందిస్తున్నాయి. ఈ లావాదేవీలు, సేవలకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఏర్పడినా, లోపాలు ఉన్నా వాటిని పరిష్కరించుకునే విధానం తెలుసుకోవడం అవసరం.

బ్యాంకింగ్ లో ఎదురయ్యే సాధారణ సమస్యలు

  • సరైన కారణం చూపకుండా ఖాతా తెరిచేందుకు నిరాకరించడం
  • ఏటీఎం లలో లావాదేవీలు జరిపేటప్పుడు
  • చెక్కులు, బిల్లులు చెల్లింపులలో జాప్యం, నిరాకరణ
  • ఆన్ లైన్ లావాదేవీల సంబంధిత సమస్యలు
  • రిజర్వు బ్యాంకు ఆదేశాల ప్రకారం వడ్డీ చెల్లించక పోవడం.
  • ఖాతాదారునికి ముందుగా సమాచారం ఇవ్వకుండా రుసుములు, సర్వీస్ చార్జీలు విధించడం.
  • బ్యాంకు బ్రాంచీలలో లాకర్లు వంటి సరిగా సేవలలు సరిగా అందించక పోవడం
  • పని వేళలలో సిబ్బంది అందుబాటులో లేకపోవడం
  • కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తే సరైన స్పందన లేకపోవడం, మొదలైనవి

బ్యాంకింగ్ సేవలలో ఎదురయ్యే సమస్యలను వివిధ దశలలో ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
ఒక స్థాయిలో పరిష్కారం కాకున్నా, సూచించిన పరిష్కారం సంతృప్తిగా లేకున్నా ఉన్నతి స్థాయిలో ఫిర్యాదు చెయ్య వచ్చు.

బ్యాంకింగ్ సమస్యలు ఫిర్యాదులు చేసే వివిధ స్థాయిలు

  • ఈ ఫిర్యాదులు రాత పూర్వకంగా, కస్టమర్ కేర్ ద్వారా, ఈ మెయిల్, రిజర్వ్ బ్యాంకు వెబ్సైటులో ఆన్ లైన్లో, మొదలైన వివిధ మాధ్యమాల ద్వారా చెయ్య వచ్చు.

  • ప్రతి స్థాయిలోనూ ఫిర్యాదుకి సమాధానం నిర్ధారించిన గడువులో రావాలి, అలా కాకుంటే పై స్థాయి వారికి ఫిర్యాదు చెయ్యవచ్చు.

కంప్లైంట్ చేసేందుకు అవసరమైన వివరాలు

  • సమస్య ఎదురయిన సందర్భం, రోజు తదితర వివరాలు
  • ఖాతా దారుని పేరు, ఖాతా నెంబర్, కంప్లైంట్ వివరాలు, ఫోన్ నెంబర్
  • బ్యాంకుకు ఫిర్యాదు చేసిఉంటే సబంధిత పత్రాలు
  • ముందు స్థాయిల్లో చేసిన ఫిర్యాదుకు సంబంధించిన రసీదులు, పొందిన సమాధానాలకు సంబంధించి పత్రాలు, ఇతర రుజువులు ఏమైనా.

ఆంద్ర ప్రదేశ్, తెలంగాణాల బ్యాంకింగ్ అంబుడ్స్ మ్యాన్ అడ్రస్

The Ombudsman,
C/o Reserve Bank of India
6-1-56, Secretariat Road
Saifabad, Hyderabad-500 004
STD Code: 040
Tel. No. 23210013/23243970
Fax No. 23210014
Email : bohyderabad@rbi.org.in

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని