అదానీ గ్రూప్‌కిచ్చిన రుణాలు తక్కువే.. బ్యాంకులకు రిస్క్ లేదు: రేటింగ్ ఏజెన్సీలు
అదానీ గ్రూప్‌నకు రుణాలు ఇచ్చిన బ్యాంకులకు ముప్పేమీ లేదని రేటింగ్ ఏజెన్సీలు పేర్కొన్నాయి.
దిల్లీ: హిండెన్ వ్యవహారం నేపథ్యంలో అదానీ గ్రూప్‌నకు (Adani Group) రుణాలు ఇచ్చిన బ్యాంకులు గురించి చర్చ జరుగుతోంది. అదానీ గ్రూప్ షేర్లు ఇటీవల తీవ్ర ఒడుదొడుకులకు లోనైన నేపథ్యంలో రుణాలిచ్చిన బ్యాంకులకూ ప్రమాదం పొంచి ఉందన్న వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ రేటింగ్ సంస్థలైన ఫిచ్, మూడీస్ స్పందించాయి. అదానీ గ్రూప్‌నకు భారతీయ బ్యాంకులు ఇచ్చిన రుణ మొత్తం అధికమేమీ కాదని, కాబట్టి పెద్ద ఇబ్బందేమీ లేదని పేర్కొన్నాయి.
అదానీ గ్రూప్‌నకు భారతీయ బ్యాంకులు ఇచ్చిన రుణమొత్తం తక్కువే కాబట్టి వాటి క్రెడిట్ ప్రొఫైల్‌కు ఎలాంటి నష్టం ఉండబోదని ఫిచ్ రేటింగ్స్ అభిప్రాయపడింది. అదానీ గ్రూప్‌నకు ప్రైవేటు బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులే అధికమొత్తంలో రుణాలు సమకూర్చాయని మూడీస్ పేర్కొంది. అయినా అది మొత్తం రుణాల్లో ఒక శాతం లోపేనని తెలిపింది. ఒకవేళ అదానీ మరింతగా రుణాలపై ఆధారపడితే బ్యాంకులకు ప్రమాదం ఉండొచ్చని మూడీస్ అభిప్రాయపడింది. అయితే, రిస్క్ కారణంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మాత్రం అదానీ గ్రూప్‌నకు నిధుల ప్రవాహం తగ్గే అవకాశం ఉందని తెలిపింది.
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చి నివేదిక తర్వాత అదానీ గ్రూప్ షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. కోట్లాది రూపాయల సంపద హరించుకుపోయింది. ఈ క్రమంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అందించిన రుణాలపైనా చర్చ జరిగింది. దీంతో ఆయా బ్యాంకులు తమ రుణ మొత్తాలను వెల్లడించాయి. ఎస్‌బీఐ రూ.27వేల కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.7వేల కోట్లు అదానీ గ్రూప్‌నకు రుణం ఇచ్చినట్లు పేర్కొన్నాయి. తమ రుణాల్లో అదానీ గ్రూప్ వాటా 0.94 శాతంగా యాక్సిస్ బ్యాంక్ పేర్కొంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Ramya Krishnan: ఇలాంటి సినిమా ఎవరు చూస్తారని అడిగా: రమ్యకృష్ణ
-
Politics News
Arvind Kejriwal: కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు
-
Crime News
Fake Currency: నకిలీ నోట్ల అడ్డా.. చేనేతపురి!
-
Ts-top-news News
Salarjung Museum: సాలార్జంగ్ మ్యూజియం.. ఆన్‌లైన్‌లోనూ వీక్షించొచ్చు..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
‘విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టు కోసం.. ఏపీ నుంచి ప్రతిపాదనలు రాలేదు’