డిమాండ్ డ్రాఫ్ట్ మీద వినియోగ‌దారుడి పేరు

మ‌నీ లాండ‌రింగ్‌ని అడ్డుకునేందుకు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గురువారం బ్యాంకుల‌కు ఒక ఆదేశాన్ని జారీ చేసింది. డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) మీద వినియోగ‌దారుడి పేరు ఉండేలా కొత్త విధానాన్ని అమ‌ల్లోకి తీసుకురావాల‌ని సూచించింది. సెప్టెంబ‌ర్ 15 నుంచి డిమాండ్ డ్రాఫ్ట్‌, పే ఆర్డ‌ర్‌, బ్యాంక్ చెక్కుల మీద వారి పేరు ఉండ‌నుంది. కేవైసీ విధానంలో మార్పులు

Published : 16 Dec 2020 18:00 IST

మ‌నీ లాండ‌రింగ్‌ని అడ్డుకునేందుకు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గురువారం బ్యాంకుల‌కు ఒక ఆదేశాన్ని జారీ చేసింది. డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) మీద వినియోగ‌దారుడి పేరు ఉండేలా కొత్త విధానాన్ని అమ‌ల్లోకి తీసుకురావాల‌ని సూచించింది. సెప్టెంబ‌ర్ 15 నుంచి డిమాండ్ డ్రాఫ్ట్‌, పే ఆర్డ‌ర్‌, బ్యాంక్ చెక్కుల మీద వారి పేరు ఉండ‌నుంది. కేవైసీ విధానంలో మార్పులు తీసుకొచ్చింది. ఈ విష‌య‌మై గురువారం బ్యాంకుల‌కు సర్క్యులార్ జారీ చేసిన‌ట్లు ఆర్‌బీఐ తెలిపింది.

మ‌నీ లాండ‌రింగ్ వంటివి అరిక‌ట్టేందుకు కేవైసీ విధానంల తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది. ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగిన‌ప్ప‌టినుంచి డీడీ వాడకం త‌గ్గిపోయిన‌ప్ప‌టికీ కొన్ని ఉద్యోగాల అప్లికేష‌న్లు విద్యాస‌సంస్థ‌ల్లో చేరేట‌ప్పుడు ఇవి అవ‌స‌రం అవుతున్నాయి. ఆర్‌బీఐ మ‌నీ లాండ‌రింగ్ వంటి దానిపై దృష్టి సారిస్తూ వ‌స్తుంది. రూ.50 వేల కంటే ఎక్కువ లావాదేవీలు డ‌బ్బు రూపంలో కాకుండా చెక్కులు లేదా ఆన్‌లైన్ ద్వారా జ‌రిపే నిబంధ‌న‌ను తీసుకొచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని