Lending Rates: ఎంసీఎల్ఆర్‌ను పెంచిన మూడు కీల‌క‌ బ్యాంకులు

ఆయా బ్యాంకుల రుణ గ్రీహీత‌ల‌కు ఈఎమ్ఐలు మ‌రింత భారం కానున్నాయి

Published : 01 Aug 2022 16:10 IST

రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ద్వైమాసిక స‌మావేశం ఈ వారంలో జ‌రుగ‌నున్న సంగ‌తి తెలిసందే. అయితే, ఈ స‌మావేశానికి ముందే ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ), పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ (పీఎన్‌బీ) లు ఎంసీఎల్ఆర్ (మార్జిన‌ల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు)ను పెంచాయి. పెంచిన రుణ రేట్లు నేటి (ఆగ‌ష్టు1,2022) నుంచి అమ‌ల‌వుతాయ‌ని బ్యాంకులు వెల్ల‌డించాయి. దీంతో ఆయా బ్యాంకుల రుణ గ్రీహీత‌ల‌కు ఈఎమ్ఐలు మ‌రింత భారం కానున్నాయి. 

ఐసీఐసీఐ బ్యాంక్‌.. 
ఈ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్ర‌కారం బ్యాంక్ అన్ని కాల‌ప‌రిమితుల‌కు ఎంసీఎల్ఆర్ ను 15 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఓవ‌ర్‌నైట్, ఒక నెల‌ ఎంసీఎల్ఆర్‌ను 7.50 శాతం నుంచి 7.65 శాతానికి, మూడు నెల‌ల‌ ఎంసీఎల్ఆర్ 7.55 శాతం నుంచి 7.70 శాతానికి, ఆరు నెల‌ల ఎంసీఎల్ఆర్ 7.70 శాతం నుంచి 7.85 శాతానికి, ఏడాది ఎంసీఎల్ఆర్‌ను 7.75 శాతం నుంచి 7.90 శాతానికి పెంచింది. ఇదిలా ఉండ‌గా గ‌త నెల (జులై 1, 2022) ఐసీఐసీఐ బ్యాంక్ ఎంసీఎల్ఆర్‌ను 20 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. 

బ్యాంక్ ఆఫ్ ఇండియా.. 
ఈ బ్యాంక్ వివిధ‌ కాల‌ప‌రిమితుల‌కు ఎంసీఎల్ఆర్ ను 10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఓవ‌ర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 6.70 శాతం నుంచి 6.80 శాతానికి, నెలసరి ఎంసీఎల్ఆర్‌ను 7.20శాతం నుంచి 7.30 శాతానికి,  మూడు నెల‌ల‌ ఎంసీఎల్ఆర్ 7.25 శాతం నుంచి 7.35 శాతానికి, ఆరు నెల‌ల ఎంసీఎల్ఆర్ 7.35 శాతం నుంచి 7.45 శాతానికి, ఏడాది ఎంసీఎల్ఆర్‌ను 7.50 శాతం నుంచి 7.60 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ ను 7.70 శాతం నుంచి 7.80 శాతానికి పెంచింది. 

పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌..
పీఎన్‌బీ కూడా అన్ని కాల‌ప‌రిమితుల‌కు ఎంసీఎల్ఆర్ ను 10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఓవ‌ర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 6.90 శాతం నుంచి 7 శాతానికి, ఒక నెల‌ ఎంసీఎల్ఆర్‌ను 6.95 శాతం నుంచి 7.05 శాతానికి, మూడు నెల‌ల‌ ఎంసీఎల్ఆర్ 7.05 శాతం నుంచి 7.15 శాతానికి, ఆరు నెల‌ల ఎంసీఎల్ఆర్ 7.25 శాతం నుంచి 7.35 శాతానికి, ఏడాది ఎంసీఎల్ఆర్‌ను 7.55 శాతం నుంచి 7.65 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 7.85 శాతం నుంచి 7.95 శాతానికి పెంచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని