Home loan: గృహ రుణ రేట్లను పెంచిన ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, పీఎన్‌బీ

ప్రస్తుతం దాదాపు అన్ని బ్యాంకులు రెపో రేటునే.. ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్కు రేటుగా తీసుకుంటున్నాయి

Published : 01 Oct 2022 23:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపోరేటును పెంచడంతో బ్యాంకులు రుణాలపై విధించే వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. రెపో రేటు 0.50 శాతం మేర పెంచడంతో ఆ మేర బ్యాంకులు సైతం వడ్డీ రేట్లు సవరిస్తున్నాయి. తాజాగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, పీఎన్‌బీ వంటి బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు.. ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్క్‌ రేటును పెంచుతున్నట్లు ప్రకటించాయి.

ఎస్‌బీఐ..

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్క్‌ రేటు (ఈబీఎల్‌ఆర్), రెపో లింక్డ్‌ లెండింగ్‌ రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌)ను 50 బేసిస్‌ పాయింట్లు (0.50%) పెంచింది. దీంతో ఎస్‌బీఐ ఈపీఎల్‌ఆర్‌ 8.55 శాతం వద్ద, ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ 8.15 శాతానికి చేరుకుంది. ఈ రేట్లు నేటి నుంచి (అక్టోబరు 1,2022) నుంచి అమలు కానున్నాయి.

పీఎన్‌బీ..

పీఎన్‌బీ కూడా రెపో లింక్డ్‌ లెండింగ్‌ రేటును 50 బేసిస్‌ పాయింట్లు (100 బీపీఎస్‌ = 1%) పెంచింది. దీంతో రుణ రేటు 7.90 శాతం నుంచి 8.40 శాతానికి చేరుకుంది. దీంతోపాటు బ్యాంకు మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ లెండింగ్‌ రేటు (ఎంసీఎల్‌ఆర్‌) కూడా 5 బేసిస్‌పాయింట్లు (0.05%) అన్ని కాలపరిమితులకు పెంచింది. దీంతో బేస్‌ రేటు 8.75 శాతం నుంచి 8.80 శాతానికి చేరుకుంది. ఇవి కూడా అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఐసీఐసీఐ బ్యాంక్‌..

ఐసీఐసీఐ బ్యాంకు కూడా ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్క్‌ రేటును 50 బేసిస్‌పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ లెండింగ్‌ రేటును పెంచింది. ఎంసీఎల్‌ఆర్‌ను 10 బేసిస్‌ పాయింట్ల మేర పెంచగా.. రుణ రేటును 8.75 శాతం నుంచి 9.25 శాతానికి పెంచారు. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌..

ఈ బ్యాంక్‌ కూడా రుణ రేటు 50 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది. ప్రస్తుతం గృహ రుణాలను 8.10 ప్రారంభ వడ్డీ రేటుతో బ్యాంకు ఆఫర్‌ చేస్తోంది. 

అన్ని బ్యాంకులు కూడా సెంట్రల్‌ బ్యాంకు పెంచిన పాలసీ రేటు 50 బేసిస్‌ (100 బేసిస్‌పాయింట్లు = 1%)కి అనుగుణంగా రుణ రేట్లను పెంచాయి. దీంతో కొత్తగా గృహ రుణం కోసం తీసుకొనేవారితో పాటు, ఇప్పటికే రుణం తీసుకున్నవారికి గృహ రుణ ఈఎంఐలు భారం కానునున్నాయి. రూ.30 లక్షల రుణాన్ని, 20 సంవత్సరాల కాలపరిమితితో తీసుకుంటే నెలవారీగా ఎంత వరకు అదనపు భారం పడుతుందో ఈ కింది పట్టిక ద్వారా తెలుసుకుందాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని