Interest rates: రుణ వ‌డ్డీ రేట్ల‌ను పెంచిన బ్యాంకులు

ఆర్‌బీఐ పాల‌సీ రేటు పెంచిన‌ప్ప‌టి నుండి అన్ని బ్యాంకులు త‌మ మార్జిన‌ల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ల (ఎంసీఎల్ఆర్‌)ని పెంచాయి.

Updated : 23 Jun 2022 14:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ హౌసింగ్ ఫైనాన్స్ ప్రాథమిక రుణ రేట్ల‌ను 60 బేసిస్ పాయింట్లు పెంచింది. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పాల‌సీ రేట్ల‌ను సంబంధిత నెల‌ల్లో 40, 50 బేసిస్ పాయింట్లు పెంచిన నేప‌థ్యంలో రెండు నెల‌ల్లో రుణ రేట్ల‌ను వ‌రుస‌గా 2 సార్లు పెంపుద‌ల చేసింది.

నాన్‌-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)లు కూడా మే నెల‌లో త‌మ రుణ రేటును (20 బీపీఎస్ పెంచి) 6.90%కి పెంచాయి. త‌న‌ఖా రుణ‌దారు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ త‌న ప్ర‌ధాన రుణ రేటును 60 బేసిస్ పాయింట్లు (బీపీఎస్‌) పెంచింది. ఇప్పుడు గృహ రుణాల‌పై క‌నీసం 7.50% వ‌డ్డీ రేటును వ‌సూలు చేస్తోంది. 

హెచ్‌డీఎఫ్‌సీ గృహ రుణాల‌పై రిటైల్ రుణ రేటును 50 బీపీఎస్ పెంచింది. జూన్‌లో ఆర్‌బీఐ పాల‌సీ రెపో రేటును పెంచిన త‌ర్వాత ఐసీఐసీఐ బ్యాంకు 8.60%కు రుణ రేటును పెంచింది. ప్ర‌భుత్వ యాజ‌మాన్యంలోని బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణ వ‌డ్డీ రేటును 40 బీపీఎస్ పెంపుతో 7.05%కి పెంచ‌గా, బ్యాంక్ ఆప్ బ‌రోడా, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు దాని రెపో లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్‌)ని 7.40%కి పెంచాయి.

ఆర్‌బీఐ పాల‌సీ రేటు పెంచిన‌ప్ప‌టి నుంచి అన్ని బ్యాంకులు త‌మ మార్జిన‌ల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (ఎంసీఎల్ఆర్‌) పెంచాయి. కోట‌క్ మ‌హీంద్రా బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఈ జూన్‌లో త‌మ ఎంసీఎల్ఆర్‌ని 30 నుంచి 35 బేసిస్‌ పాయింట్లు పెంచాయి. ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా త‌మ ఎంసీఎల్ఆర్‌ను పెంచాయి.

న్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు బీపీఎస్‌ పెరుగుద‌ల‌తో రుణ రేట్ల‌ను పెంచిన‌ప్ప‌టికీ ఈ వ‌డ్డీ రేట్లు త‌క్కువ స్థాయిలోనే ఉన్నాయ‌ని దాదాపు అన్ని రుణ సంస్థ‌లు భావిస్తున్నాయి. వ‌డ్డీ రేట్ల పెంపు మార్కెట్ ప‌రిస్థితుల‌కు అనుగుణంగానే ఉన్నాయ‌ని, ఖాతాదారుల‌ను ఇప్ప‌టికీ ఈ రుణ రేట్లు మెప్పిస్తాయ‌ని రుణ సంస్థ‌ల నిపుణులు భావిస్తున్నారు. చారిత్రాత్మ‌కంగా పోల్చిన‌ట్ల‌యితే ఈ రేట్లు ఇప్ప‌టికీ చాలా పోటీ స్థాయిలోనే ఉన్నాయి. గృహ రుణాల కోసం డిమాండ్ పెరిగితే అందులో ఇమిడి ఉన్న మార్కెట్ ప‌రిస్థితుల‌తో మొత్తం అన్ని రంగాలకు డిమాండ్ పెరుగుంది. ముఖ్యంగా గృహ రుణ డిమాండ్‌లో అనేక రంగాల జీవ‌నోపాధి కచ్చితంగా పెరుగుతుంది. సిబిల్ స్కోర్ మంచి స్థితిలో ఉన్న‌వారికి ఇప్ప‌టికీ తక్కువ గృహ రుణ వ‌డ్డీ రేట్లనే బ్యాంకులు వ‌సూలు చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని