Home Loans: గృహ రుణాలపై తక్కువ వడ్డీ రేట్లను వసూలు చేసే బ్యాంకులివే..
ఇప్పటికీ చాలామంది వృత్తినిపుణులు, వ్యాపారులు గృహాల నిర్మాణం/కొనుగోలుకు బ్యాంకులు మీదే ఆధారపడతారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆర్‌బీఐ రెపోరేట్లను పెంచిన తర్వాత గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ.. ఇప్పటికీ ఏ ఇతర రుణాలతో పోల్చి చూసినా తక్కువ వడ్డీ రేట్లకు లభించేవి ఇంటి రుణాలే. ఇల్లు నిర్మించడానికి/ కొనుగోలు చేయడానికి ఈ రోజుల్లో బ్యాంకు రుణాలపైనే ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. గృహ రుణాలు సాధారణంగా అధిక విలువతో కూడిన రుణాలు కాబట్టి బ్యాంకులు, హెచ్‌ఎఫ్‌సీలు రుణగ్రహీత క్రెడిట్ స్కోరు, తిరిగి చెల్లించే సామర్థ్యం, కొనుగోలు చేయబోయే ఆస్తిపై కఠినమైన తనిఖీలతో పాటు ఆదాయాన్ని జాగ్రత్తగా, వివరణాత్మకంగా అంచనా వేస్తాయి. 750, అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉన్నవారికే బ్యాంకులు ఎక్కువ ప్రాధాన్యమిస్తాయి. తక్కువ వడ్డీ రేట్లు సాధారణంగా కఠినమైన అర్హత నిబంధనలతో వస్తాయని గమనించాలి. ఒకవేళ మీరు గృహ రుణం కోసం చూస్తున్నట్లయితే తక్కువ మొత్తంలో వడ్డీ వసూలు చేస్తున్న బ్యాంకుల జాబితాను ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నాం. రూ.30 లక్షల పైనుంచి రూ. 75 లక్షల వరకు గృహ రుణాలపై వివిధ ప్రభుత్వ, ప్రైవేటురంగ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఎంతెంత ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
గమనిక: ఈ పట్టికలో బ్యాంకులు తెలిపిన అత్యల్ప వడ్డీ రేట్లనే ఇవ్వడం జరిగింది. రుణ మొత్తం, కాలవ్యవధి, రుణగ్రహీత ఆదాయం, క్రెడిట్ స్కోరును బట్టి వడ్డీ రేట్లు మారొచ్చు. ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర రుసుములు ఈఎంఐల్లో కలపలేదు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Karnataka polls: హంగ్‌కు ఛాన్స్‌లేదు.. ఎవరితోనూ పొత్తులుండవ్..: డీకేఎస్
-
Sports News
ICC Rankings: టాప్‌లోకి రషీద్ ఖాన్ .. మెరుగైన రోహిత్, హార్దిక్ ర్యాంకులు
-
General News
Viveka Murder case: ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్న ఎంపీ అవినాష్‌రెడ్డి
-
Movies News
Dasara: ‘బాహుబలి’.. ‘ఆర్ఆర్ఆర్’.. ఇప్పుడు ‘దసరా’!
-
India News
PM Modi: భారత ఆర్థికాభివృద్ధి.. ప్రజాస్వామ్య ఘనతే: ప్రధాని మోదీ
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు