FD Interest Rates: వ‌డ్డీ రేట్లు పెంచిన బ్యాంకులు..ఇవే!

రేట్లను పెంచిన కొన్ని బ్యాంకుల జాబితా ఇక్కడ ఉంది

Updated : 17 Aug 2022 16:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ద్రవ్యోల్బణ కట్టడికి ఆర్‌బీఐ చర్యలు చేపట్టింది. ఈ మధ్య 3 సార్లు రెపో రేటును140 బేసిస్ పాయింట్ల వ‌ర‌కు పెంచింది. దీంతో దాదాపుగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులూ త‌మ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వ‌డ్డీ రేట్ల‌ను పెంచుతున్నాయి. దీంతో ఎఫ్‌డీల్లో పొదుపు చేయాలనుకునేవారికి ఇది సానుకూల అంశంగా మారింది. ఇప్పటికే రేట్లను పెంచిన కొన్ని బ్యాంకుల జాబితా ఇక్కడ అందిస్తున్నాం.

ఎస్‌బీఐ: ఉత్స‌వ్ డిపాజిట్‌ పేరిట ఎస్‌బీఐ ప్ర‌త్యేక ట‌ర్మ్ డిపాజిట్‌ని ప్ర‌వేశ‌పెట్టింది. ఈ పథకంలో వెయ్యి రోజుల కాల‌వ్య‌వ‌ధిపై సంవ‌త్స‌రానికి 6.10% వ‌డ్డీ రేటును అందిస్తోంది. సీనియ‌ర్ సిటిజ‌న్లు సాధార‌ణ రేటు కంటే 0.50% అద‌న‌పు వ‌డ్డీ రేటు పొందుతారు. ఈ ప‌థ‌కం 75 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది.

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా: బ్యాంక్ ఆఫ్ బ‌రోడా కూడా ‘తిరంగా’ డిపాజిట్ ప‌థ‌కాన్ని ప్రారంభించింది. 444 రోజుల డిపాజిట్‌పై 5.75 శాతం వ‌డ్డీ రేటును అందిస్తోంది. ఇదే ప‌థ‌కం కింద 555 రోజుల డిపాజిట్ల‌పై 6 శాతం వ‌డ్డీ ఇస్తోంది. సీనియ‌ర్ సిటిజ‌న్లు అద‌నంగా 0.5 శాతం వ‌డ్డీ పొందుతారు.

కెన‌రా బ్యాంకు: మ‌రో ప్ర‌భుత్వ రంగ బ్యాంకు కెన‌రా బ్యాంకు 666 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై 6 శాతం వ‌డ్డీ రేటును అందిస్తోంది.

పీఎన్‌బీ: ప‌ంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు 1,111 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై 5.75 శాతం వ‌డ్డీ రేటును ప్రకటించింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకైన హెచ్‌డీఎఫ్‌సీ 5 సంవ‌త్స‌రాల ఒక రోజు నుంచి 10 సంవ‌త్స‌రాల మ‌ధ్య కాల‌వ్య‌వ‌ధి ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై 5.75 శాతం వ‌డ్డీ రేటును ప్రకటించింది.

ఐసీఐసీఐ బ్యాంకు: దేశంలో దిగ్గ‌జ‌ ప్రైవేట్ బ్యాంకైన ఐసీఐసీఐ 5 సంవ‌త్స‌రాల ఒక రోజు నుంచి 10 సంవ‌త్స‌రాల మ‌ధ్య కాల‌వ్య‌వ‌ధి ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై 5.75 శాతం వ‌డ్డీ రేటుని అందిస్తోంది.

యాక్సిస్ బ్యాంకు: ప్రైవేట్ బ్యాంకైన యాక్సిస్ బ్యాంకు 17-18 నెల‌ల డిపాజిట్ల‌పై 6.05 శాతం వ‌డ్డీని అందిస్తోంది.

కోట‌క్ మ‌హీంద్రా, ఇండియ‌న్ ఓవ‌ర్సీస్ బ్యాంకు, ఉజ్జీవ‌న్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు వంటి ఇత‌ర బ్యాంకులు కూడా త‌మ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వ‌డ్డీ రేట్ల‌ను పెంచాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని