వృథా ఖ‌ర్చుల‌ని త‌గ్గించుకుని, సంప‌న్నుల‌మ‌వుదామిలా!

మ‌న బంధువులు లేదా స్నేహితులు మంచి ఫోన్ లేదా కారు కొన్నార‌నో మ‌న‌మూ అలా చేయ‌డం అవివేక‌మే అవుతుంది. ఇలాంటి సంద‌ర్భాల్లో భావోద్వేగాల‌ను నియంత్రించుకుని ఆ వ‌స్తువు మ‌న‌కు నిజంగా అవ‌స‌ర‌మేనా....

Updated : 02 Jan 2021 15:59 IST

మ‌న బంధువులు లేదా స్నేహితులు మంచి ఫోన్ లేదా కారు కొన్నార‌ని మ‌న‌మూ అలా చేయ‌డం అవివేక‌మే అవుతుంది. ఇలాంటి సంద‌ర్భాల్లో భావోద్వేగాల‌ను నియంత్రించుకుని ఆ వ‌స్తువు మ‌న‌కు నిజంగా అవ‌స‌ర‌మేనా అన్న ప్ర‌శ్న వేసుకుంటే అన‌వ‌స‌ర ఖ‌ర్చులు త‌గ్గించుకున్న వారమ‌వుతాము. నిజానికి చాలా తెలివైన వారు కూడా డ‌బ్బు విష‌యంలో అప్ప‌డ‌ప్పుడు పప్పులో కాలు వేస్తుంటారు. ఖ‌ర్చుల విష‌యంలో నిర్ల‌క్ష్య వైఖ‌రి వ‌ల్ల‌నో లేదా తాత్కాలిక ఆనందం కోస‌మో అలా చేస్తుంటారు. మ‌ళ్లీ తాము క‌ష్ట‌పడి సంపాదించిన సొమ్ము ఎక్క‌డికి పోతోంద‌ని వారే బాధ ప‌డుతూ ఉంటారు. చాలా మంది డ‌బ్బు విష‌యంలో చేసే వృథా ఖ‌ర్చులు, వాటిని ఎలా అరిక‌ట్టాలో ఈ కింద వివరించాం.

1.తాత్కాలిక ఆనందాల కోసం ఖ‌ర్చు చేయొద్దు

ఒక రూపాయి ఆదా చేస్తున్నామంటే అర్థం, రూపాయి సంపాదించిన‌ట్లేనని మ‌న పెద్ద‌లు త‌ర‌చూ చెబుతుంటారు. అందుకే తాత్కాలిక ఆనందాలైన త‌ర‌చూ బ‌య‌ట భోజ‌నం చేయ‌డం, విలాస‌వంత‌మైన మొబైల్ ఫోనును ఖ‌రీదు చేయ‌డం, అవ‌స‌రం లేకున్నా విహార యాత్ర‌ల‌కు వెళ్ల‌డం వంటి ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకోవాలి.

జీవితం ఉన్న‌దే అనుభ‌వించ‌డానికి, సంపాదించేదే ఖ‌ర్చు చేయ‌డానికి అని చాలా మంది అంటుంటారు. కానీ అన‌వ‌స‌ర‌మైన వాటిపై డ‌బ్బులు త‌గ‌లేసి, త‌ర్వాత బాధ‌ప‌డితే ఇబ్బందులు ప‌డాల్సింది మ‌న‌మే క‌దా. కాబ‌ట్టి ఇలాంటి సంద‌ర్భాలు ఎదురైన‌ప్ప‌డు, అది నిజంగా మ‌న‌కు అవ‌స‌రమా, దాని వ‌ల్ల ఏవైనా ప్ర‌యోజ‌నం ఉందా అనే ప్ర‌శ్న వేసుకోండి. అంత‌గా అవ‌స‌రం లేదనే స‌మ‌ధానం వ‌చ్చిన‌ప్పుడు, ఆ నిర్ణ‌యాన్ని వాయిదా వేసుకోవ‌డ‌మే మంచిది.

మీ స్నేహితులు, బంధువులు విలాసవంత‌మైన జీవ‌నం గ‌డుపుతున్నార‌ని మీరు అలా ఆలోచిస్తే స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు. మీకు నిజంగా అవ‌స‌ర‌మైన వాటిపైనే డ‌బ్బు వెచ్చిస్తే వృథా ఖ‌ర్చుల‌ను అరిక‌ట్ట‌వ‌చ్చు.

2. బ‌డ్జెట్ రూపొందించుకుని అందుకనుగుణంగా ఖ‌ర్చు చేయండి

వృథా ఖ‌ర్చుల‌ను అరిక‌ట్టేందుకు మంచి మార్గం బ‌డ్జెట్ త‌యారు చేసుకుని అందుక‌నుగుణంగా ఖ‌ర్చు చేయ‌డం. ప్ర‌తీ నెలా ప్రారంభంలోనే బ‌డ్జెట్ రూపొందించుకుని, వేటికెంత ఖ‌ర్చు అవుతుందో ఒక జాబితా త‌యారు చేసుకోండి. అవ‌స‌ర‌మైన ఖ‌ర్చుల‌న్నీ అయిపోయిన త‌ర్వాత వృథా ఎక్క‌డ జ‌రుగుతోందో తెలుసుకుని దానిని నియంత్రించండి. ఇలా మిగిలిన డ‌బ్బును స‌క్ర‌మంగా ఏవైనా ఆర్థిక సాధ‌నాల‌లో పెట్టుబ‌డిగా పెడితే, సంప‌ద‌ని నిర్మించుకోవ‌చ్చు.

చిన్న చిన్న మొత్తాల్లో డ‌బ్బుని ఆదా చేయాల‌నుకున్న‌ప్పుడు, ఖ‌ర్చు చేయాల‌న్న ఉబ‌లాటాన్ని త‌గ్గించుకోండి. ఖ‌ర్చు చేయ‌డంలో క‌న్నా పొదుపు చేయ‌డంలో ఆనందాన్ని వెతుక్కునేందుకు ప్ర‌య‌త్నించ‌డం మంచిది. ఒక వేళ ఖ‌ర్చుల‌ను నియంత్రించుకోలేక‌పోతే, ఖ‌ర్చవుతున్న దాంట్లో కొంత మేరైనా ఆదా చేయ‌డానికి ప్ర‌య‌త్పిస్తే ఇబ్బందులుండ‌వు.

3. తెలివిగా పెట్టుబ‌డులు పెట్టి, డ‌బ్బు పొదుపు చేయండి

ధ‌న‌వంతుల‌లో 50 శాతం మంది డ‌బ్బులు ఆదా చేస్తే, మిగిలిన 50 శాతం మంది ద్ర‌వ్యోల్బ‌ణ ప్ర‌భావాన్ని ఎదుర్కొని మ‌రీ రాబ‌డుల‌నిచ్చే సాధానాల‌లో పెట్టుబ‌డులు పెడుతుంటారు. ఉదాహ‌ర‌ణ‌కు మీరు నెట్‌ఫ్లిక్స్ నెలవారీ చందా రూ.800 క‌డుతున్నార‌నుకోండి. అదే ప్ర‌తీ నెలా రూ.800 ల‌ను 15 శాతం రాబ‌డుల‌నిచ్చే ప‌థ‌కాల‌లో 30 ఏళ్ల పాటు పెడితే సుమారు రూ.55 ల‌క్ష‌ల నిధి స‌మ‌కూరే అవ‌కాశం ఉంద‌ని మీరెప్పుడైనా ఆలోచించారా. తెలివైన పెట్టుబ‌డులిచ్చే ప్ర‌తిఫ‌లాలిలా ఉంటాయి.

మీ వ‌య‌సు 30 ఏళ్ల కంటే త‌క్కువున్న‌ప్పుడు, మీరు పొదుపు చేసిన మొత్తంలో ఎక్కువ డ‌బ్బుల‌ను ఈక్విటీ లేదా స్టాక్ మార్కెట్ ఆధారిత సాధ‌నాల‌లో పెట్టుబ‌డులు పెట్టండి. మిగిలిన పెట్టుబ‌డుల‌లో త‌క్కువ మొత్తాల‌ను మాత్ర‌మే డెట్ సాధనాల‌లో మ‌దుపు చేయండి. మ్యూచ‌వ‌ల్ ఫండ్ల ద్వారా పెట్టుబ‌డుల‌లో వైవిధ్య‌త నెల‌కొంటుంది. మీ పెట్టుబ‌డుల పోర్ట్‌ఫోలియోలో 5 శాతం వ‌ర‌కు బంగారంలో పెట్టండి. స్థిరాస్తిలో దీర్ఘ‌కాలం మ‌దుపు చేయ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

4. అప్పులు లేకుండా చూసుకోండి

ఈ లోకంలో అస‌లైన ధ‌న‌వంతుడంటే అప్పులు లేనివాడు మాత్ర‌మే. ధ‌న‌వంతుల్లో చాలా మంది త‌మ‌పై రుణ‌భారం లేకుండా చూసుకుంటూ ఉంటారు. భారీ మొత్తంలో అప్పులు తీసుకున్న పారిశ్రామిక‌వేత్త‌లు, రుణం చెల్లించ‌లేక దివాలా తీయడం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే సాధార‌ణ వ్య‌క్తులు త‌మ అవ‌స‌రాల‌కు స‌రిప‌డా డ‌బ్బులు లేన‌ప్పుడు మాత్ర‌మే అప్పులు తీసుకుంటూ ఉంటారు. మీ ద‌గ్గ‌ర తగినంత డ‌బ్బు లేన‌ప్ప‌డు అప్పు తీసుకోక త‌ప్ప‌దు. దీనికోసం మీరు భవిష్య‌త్‌లో ఆర్జించ‌బోయే ఆదాయాన్ని అప్పుగా తీసుకుని, దానిని ఎక్కువ వ‌డ్డీతో క‌లిపి తిరిగి క‌డుతున్నార‌న్న మాట‌.

ఇలా తిరిగి చెల్లిస్తూ పోతూ ఉంటే, మీరు ఎప్ప‌టికి ధ‌న‌వంతుల‌య్యేను. అప్పులు మ‌న ఆదాయానికి చేటు తెస్తుంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు మీరు నెల‌కు రూ.20 వేల చొప్పున 15 ఏళ్ల పాటు ఈఎమ్ఐలు క‌డుతూ పోతూ ఉంటే, దాదాపు రూ.36 ల‌క్ష‌ల ఆదాయాన్ని కోల్పోతున్న‌ట్లే. అప్పులున్నంత కాలం మీరు ఎప్ప‌టికీ, ధ‌న‌వంతులు కాలేరు.

5. బిల్లులు స‌కాలంలో చెల్లించండి

ఉద్ధేశపూర్వ‌కంగా లేదా మామూలుగానే క్రెడిట్ కార్డు బిల్లులను స‌కాలంలో చెల్లించ‌ని వారి జాబితాలో మీరూ ఉన్నారా, అయితే మీరు ఎంతో డ‌బ్బు వృథా చేస్తున్నార‌న్న మాట‌. ఉదాహ‌ర‌ణ‌కు, మీకు రెండు క్రెడిట్ కార్డులుండి, వాటి బిల్లుల‌ను స‌కాలంలో క‌ట్ట‌లేద‌నుకోండి. త‌ర్వాత వాటిపై ఆల‌స్య రుసుముల రూపేణా భారీగా డ‌బ్బులు క‌ట్టాల్సిన ప‌రిస్థితులేర్ప‌డ‌తాయి. ఉదాహ‌ర‌ణ‌కు ప్ర‌తీ నెలా రూ.1000 చొప్పున ఆల‌స్య రుసుములు క‌డుతున్నార‌నుకోండి.

అదే మొత్తాన్ని ఏటా 8 శాతం రాబ‌డులిచ్చే ప‌థ‌కాల్లో 30 ఏళ్ల పాటు మ‌దుపు చేస్తే రూ.15 ల‌క్ష‌ల నిధిని సొంతం చేసుకోవ‌చ్చు. ఇలా స‌కాలంలో బిల్లులు చెల్లించ‌ని కార‌ణంగా, 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని