ESI ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందొచ్చు..?
ESI benefits: ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలకు ఈఎస్ఐ పథకం ఉచిత వైద్య సంరక్షణను అందిస్తుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆఫ్ ఇండియా (ESIC) వ్యవస్థీకృత రంగంలోని ఉద్యోగులకు సామాజిక-ఆర్థిక రక్షణను అందించే సామాజిక భద్రతా పథకం. ఉద్యోగులకు.. అనారోగ్యం, ప్రసూతి, వైకల్యం, పని చేసే సమయంలో జరిగిన ప్రమాదాల కారణంగా ఏర్పడే గాయాలు, మరణం వంటి వాటి నుంచి (ఆర్థిక) రక్షణ కల్పిస్తుంది. అలాగే, ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలకు ఉచిత వైద్య సంరక్షణను అందిస్తుంది.
ఎవరు అర్హులు?
పది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు, కర్మాగారాలు, షాపులు, ఆఫీసుల్లో పనిచేస్తూ నెలకు రూ.21 వేలు అంతకంటే తక్కువ వేతనం ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. అర్హులైన ఉద్యోగులను ఈఎస్ఐసీ పథకం కింద నమోదు చేయడం సంస్థ యజమాని బాధ్యత. ఈ పథకంలో ఉద్యోగి వేతంనంలో యజమాని 3.25%, ఉద్యోగి 0.75%కు సమానమైన మొత్తాన్ని చందా కింద జమచేస్తారు. ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు వైద్య సంరక్షణ అందుతుంది. చికిత్సకు అయ్యే ఖర్చుపై పరిమితి లేదు.
యజమాని బాధ్యతే..
నెలకు రూ.21 వేలలోపు జీతం ఉన్న ఉద్యోగులను ఈఎస్ఐలో రిజిస్టర్ చేయడం సంస్థ యజమాని బాధ్యత. ఉద్యోగి, పైన తెలిపిన వేతన పరిధిలో ఉన్నంత కాలం ఈఎస్ఐ పరిధిలో ఉంటారు. ఉద్యోగం మారినా దాని ప్రభావం బీమాపై పడదు. ఈఎస్ఐ వర్తించినంతకాలం బీమా సంఖ్య కూడా మారదు.
ఈఎస్ఐ పథకం ప్రయోజనాలు..
మెడికల్ బెనిఫిట్: ఈఎస్ఐ పరిధిలోకి వచ్చే వ్యక్తి ఉపాధిని పొందిన నాటి నుంచి అతడు/ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు పూర్తి వైద్య సంరక్షణ అందుతుంది. కాంట్రీబ్యూషన్తో సంబంధం లేకుండా అందరికీ ఒకేరకమైన వైద్య సాయం అందుతుంది. చికిత్సకు అయ్యే ఖర్చుపై గరిష్ఠ పరిమితి లేదు. పదవీ విరమణ పొందిన వారు, శాశ్వత వికలాంగులకు, వారి జీవిత భాగస్వాములకు కూడా టోకెన్ వార్షిక ప్రీమియం రూ.120 చెల్లింపుపై వైద్య సంరక్షణ అందిస్తారు.
సిక్నెస్ బెనిఫిట్: ధ్రువీకరించిన కొన్ని అనారోగ్యాలతో బాధపడతున్న సమయంలో సిక్ లీవ్ తీసుకోవచ్చు. ఏడాదిలో 91 రోజుల పాటు ఈ సెలవులు తీసుకునే అవకాశం ఉంది. అనారోగ్య కాలంలో సిక్నెస్ బెనిఫిట్ కింద నగదు రూపంలో పరిహారం ఇస్తారు. కార్మికుడి జీతంలో 70% చొప్పున ఈ పరిహారం ఉంటుంది. ఈ ప్రయోజనం కోసం ఆరు నెలల కాలంలో కనీసం 78 రోజులు తప్పనిసరిగా కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది.
మెటర్నిటీ బెనిఫిట్: గర్భదారణ సమయంలో 26 వారాల పాటు మెటర్నిటీ బెనిఫిట్ అందిస్తారు. వైద్యుడి సలహాపై మరొక నెల పాటు పొడిగించుకోవచ్చు. పూర్తి జీతం చెల్లిస్తారు.
తాత్కాలిక వైకల్యం: ఉద్యోగంలో ఉన్నప్పుడు గాయపడితే కాంట్రీబ్యూషన్లతో సంబంధం లేకుండా.. గాయపడిన నాటి నుంచి అంగవైకల్యం కొనసాగినంత కాలం వేతనంలో 90% చొప్పున ప్రయోజనాన్ని చెల్లిస్తారు.
శాశ్వత అంగవైకల్యం: మెడికల్ బోర్డు ధ్రువీకరణపై ప్రమాదం కారణంగా సంపాదన సామర్థ్యాన్ని కోల్పోయిన స్థాయిని బట్టి, నెలవారీగా చెల్లించే వేతనంలో 90% చొప్పున ప్రయోజనాన్ని చెల్లిస్తారు.
డిపెండెంట్ బెనిఫిట్: ఉద్యోగంలో గాయం లేదా వృత్తిపరమైన ప్రమాదం కారణంగా మరణం సంభవిస్తే, ఉద్యోగిపై ఆధారపడిన వారికి అతడి నెలవారీ వేతనంలో 90% మొత్తాన్ని చెల్లిస్తారు.
ఇతర ప్రయోజనాలు..
- ఉద్యోగి మరణిస్తే అతడి అంతిమ కర్మల కోసం తనపై ఆధారపడిన వారికి రూ.15,000/- చెల్లిస్తారు.
- ఈఎస్ఐ ఉన్న మహిళ లేదా ఈఎస్ఐ సభ్యుడి భార్య.. ఈఎస్ఐ పథకం కింద తగిన వైద్య సేవలు అందుబాటులో లేని ప్రదేశంలో ఉంటే 'కన్ఫైన్మెంట్' ప్రయోజనాన్ని అందజేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
విశ్రాంత జీవితంలో తోడుగా
పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది -
చిన్న, మధ్యస్త REITS ద్వారా స్థిరాస్తిలో పెట్టుబడులు.. సురక్షితమేనా?
తరతరాలుగా భారతీయులు స్థిరాస్తి, బంగారం వంటి సంప్రదాయ పెట్టుబడులను గౌరవిస్తున్నారు. మారుతున్న కాలంలో స్థిరాస్తి పెట్టుబడులకు మారో రూపమే SM REITS.. వీటి గురించి తెలుసుకోండి. -
PPF vs VPF: పీపీఎఫ్, వీపీఎఫ్‌లో ఏది బెటర్..?
PPF or VPF: వాలంటరీ ప్రావిడెండ్ ఫండ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో ఏది బెటర్ అని ఆలోచిస్తున్నారా? ఈ విషయాల్ని పరిశీలించాక మీ నిర్ణయం తీసుకోండి.. -
Foreign Trip: విదేశీ టూర్‌ను ఇబ్బంది లేకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలి?
విదేశీ వెకేషన్‌ను ప్లాన్ చేయడానికి అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రయాణం ఇబ్బంది లేకుండా, సజావుగా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. -
Claim Ratio: ఆరోగ్య బీమా కంపెనీల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో వివిధ బీమా సంస్థలకు సంబంధించి.. ఆరోగ్య బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి. -
కుటుంబానికి ధీమానిచ్చేలా.. బీమా పాలసీ
సంపాదించిన మొత్తంలో నుంచి పొదుపు, పెట్టుబడులకు కొంత కేటాయిస్తుంటాం. కుటుంబానికి ఆర్థికంగా అవసరమైన లక్ష్యాల సాధనకు ఇవి ఉపయోగడేలా చూసుకుంటాం. -
పన్ను ఆదా ఇలా చేద్దాం
ఆర్థిక సంవత్సరం ముగింపు దగ్గరకు వచ్చేసింది. పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారు తమ పొదుపు,పెట్టుబడులను వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. -
డెట్ ఫండ్లలో మదుపు చేస్తున్నారా?
ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితి కనిపిస్తుండటంతో చాలామంది సురక్షిత పథకాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటిలో మదుపు చేసేటప్పుడు పరిశీలించాల్సిన అంశాలను తెలుసుకుందాం. -
Credit cards: క్రెడిట్ కార్డుదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్!
Credit Cards: క్రెడిట్ కార్డుల విషయంలో ఏప్రిల్ 1 నుంచి మార్పులు రానున్నాయి. రివార్డులు, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ విషయంలో బ్యాంకులు కీలక మార్పులు చేపట్టాయి. -
Health Insurance Claims: ఆరోగ్య బీమా క్లెయిమ్ విషయంలో ఈ తప్పులు చేయొద్దు!
Insurance claims: ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు కొన్నిసార్లు తిరస్కరణకు గురవుతుంటాయి. కాబట్టి ఈ తప్పులు చేయొద్దు.. -
Health Emergency: ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి?
జీవితంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా దాన్ని ఎదుర్కోడానికి మనం ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోండి.. -
Mutual Funds: మ్యూచువల్ ఫండ్ల ఉపసంహరణ సమస్య.. ఎన్ని రోజులు పడుతోందంటే?
మార్కెట్లలో మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్లలో ఉన్న తమ నిధులను మదుపుదార్లు ఉపసంహరించుకున్నప్పుడు నిధుల బదిలీకి వివిధ సంస్థలు కొంత సమయాన్ని తీసుకుంటున్నాయి. ఎంత మొత్తం ఉపసంహరణకు.. ఎంత సమయం తీసుకుంటున్నాయో ఇక్కడ చూడండి. -
Insurance Agent: బీమా ఏజెంట్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి?
చాలా మందికి వారి వ్యక్తిగత జీవితంలో బీమా చాలా అవసరం. పాలసీ కొనుగోలు సమయంలో ఏజెంట్/అడ్వైజర్ అవసరం పడొచ్చు. వీరి గురించి ఇక్కడ తెలుసుకోండి. -
ఆరోగ్య బీమా రోజువారీ ఖర్చులను అందించేలా...
వైద్య ఖర్చులు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. అదే సమయంలో ఆరోగ్య బీమా రంగంలోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయి. -
స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల్లో అప్రమత్తంగా
స్టాక్ మార్కెట్ అంటేనే అనిశ్చితికి మారు పేరు. చిన్న వార్త వచ్చినా దానికి ప్రతికూలంగానో, అనుకూలంగానో స్పందిస్తుంటాయి. ఒక్క రోజులోనే మదుపరుల సంపద కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆవిరవుతుంది. -
స్థిరాస్తి రంగంలో...
హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ కొత్తగా హెచ్డీఎఫ్సీ నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ ఫండ్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఓ) ఈ నెల 21న ముగుస్తుంది. -
Health Insurance: విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్ధుల కోసం ఆరోగ్య బీమా
విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్య బీమా తప్పనిసరి. భారత్‌లో ప్రముఖ బీమా సంస్థలు విదేశీ విద్యార్థులకు అందించే బీమా సౌకర్యాలు ఇక్కడ తెలుసుకుందాం.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ అరెస్టుపై.. విపక్ష కూటమి నిరసన వాయిదా
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్‌కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలీకాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!