Mutual Funds: ఇండెక్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రయోజనాలుంటాయా?
ఇండెక్స్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి, అవేంటో ఇక్కడ చూడండి.
ఇండెక్స్ ఫండ్స్(Index Funds)లో పెట్టుబడి పెట్టడం అనేది సురక్షితమైన వ్యూహాలలో ఒకటి. ఇండెక్స్ ఫండ్‌లు ఒకే ఫండ్‌లోని వేలకొద్ది సెక్యూరిటీలకు ఎక్స్‌పోజర్‌ను అందిస్తాయి. అందువల్ల విస్తృత వైవిధ్యీకరణ ద్వారా నష్టాన్ని కొంత వరకు తగ్గిస్తుంది. పెట్టుబడులు ఫలప్రదమవ్వాలంటే డైవర్సిఫికేషన్ ముఖ్యం. ఇండెక్స్ ఫండ్‌ను కొనుగోలు చేయడం ద్వారా, మదుపుదారుడు సులభమైన, స్వల్ప పెట్టుబడితో విభిన్నమైన సెక్యూరిటీలను ఎంచుకోవచ్చు.
వివిధ మార్కెట్ క్యాపిటలైజేషన్, రంగాలతో కూడిన కంపెనీలలో పెట్టుబడి పెట్టడం ద్వారా పెట్టుబడిదారుల ఈక్విటీ పోర్ట్‌ఫోలియో వైవిధ్యభరితంగా ఉంటుంది, (ఈక్విటీ)పెట్టుబడిలో నష్టభయాన్ని తగ్గిస్తుంది. ఇండెక్స్ ఫండ్స్‌లో పెట్టుబడి (NSE)Nifty, (BSE)Sensex లాంటి స్టాక్ మార్కెట్ సూచీలను అనుసరిస్తుంది. ఇండెక్స్ ఫండ్స్ లక్ష్యం..మార్కెట్ పనితీరుకు సరిపోయే రాబడిని అందించడం. తద్వారా ఒకే ఫండ్‌ను కలిగి ఉన్న పెట్టుబడిదారులందరికీ ఇండెక్స్ ఫండ్ నుంచి వచ్చే రాబడి సమానంగా ఉంటుంది. సాధారణంగా ఇండెక్స్ ఫండ్స్‌లో పెట్టుబడులు సరళమైనవి, తక్కువ ఖర్చుతో కూడుకున్నవి, పారదర్శకంగా ఉంటాయి. పెట్టుబడిదారులు ఇటువంటి ఫండ్ల ద్వారా తమ పెట్టుబడిపై మంచి రాబడిని పొందొచ్చు.
తక్కువ నిష్పత్తిలో ఖర్చు, ఫీజు
క్రియాశీలంగా నిర్వహణలో ఉండే మ్యూచువల్ ఫండ్‌ల మాదిరిగా కాకుండా, ఇండెక్స్ ఫండ్‌లు సాధారణంగా తక్కువ వ్యయ నిష్పత్తులను కలిగి ఉంటాయి. దీని వల్ల రాబడి కొంత వరకు పెరుగుతుంది.
పన్ను ప్రయోజనాలు
క్రియాశీలంగా నిర్వహణలో ఉండే మ్యూచువల్ ఫండ్ల కంటే వ్యక్తిగత సెక్యూరీటీల కొనుగోలు, అమ్మకాలు తక్కువగా ఉంటాయి. తద్వారా ఇటువంటి ఫండ్లపై పన్ను ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. కాలక్రమేణా మదుపుదార్లు (పన్ను తర్వాత)మంచి రాబడినే పొందొచ్చు.
నిర్వహణ సులువు
ఇండెక్స్ ఫండ్లు తమ ఆస్తి కేటాయింపును సులభంగా మార్చవు. మ్యూచువల్ ఫండ్లలో ఇతర ఫండ్ల కంటే వీటిని నిర్వహించడం సులువు. సరళంగా చెప్పాలంటే, ఒక పెట్టుబడిదారు ఇండెక్స్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినప్పుడు దాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకునే వరకు లేదా మరొక మేనేజర్ బాధ్యతలు స్వీకరించేవరకు ఫండ్లో ఆస్తి కేటాయింపు అలాగే ఉంటుంది.
నిష్పక్షపాత పెట్టుబడి
ఇండెక్స్ ఫండ్‌లో ఆటోమేటిక్‌గా, కొన్ని విధానాల, సూచీల ఆధారంగా పెట్టుబడి ప్రక్రియ జరుగుతుంది. పెట్టుబడి పెట్టవలసిన మొత్తం ఫండ్ మేనేజర్ మ్యాండేట్ ప్రకారం ఉంటుంది. తద్వారా పెట్టుబడి నిర్ణయాలలో మానవ విచక్షణ పక్షపాతానికి అవకాశం ఉండదు.
రిస్క్, లాభాలు
ఇండెక్స్ ఫండ్లు మార్కెట్ ఇండెక్స్‌ను లోబడి నిష్క్రియాత్మకంగా నిర్వహణలో ఉండే ఫండ్లు. అందుచేత ఇతర ఫండ్ల కంటే తక్కువ అస్థిరతను కలిగి ఉంటాయి. మార్కెట్ ర్యాలీ సమయంలో ఇండెక్స్ ఫండ్ల నుంచి రాబడులు బాగానే ఉండే అవకాశం ఉంది. అయితే పెట్టుబడిదారుని ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలో ఇండెక్స్ ఫండ్లు, యాక్టివ్ ఫండ్ల మంచి మిశ్రమం ఉండాలి. దీంతో పోర్ట్ఫోలియోలో రిస్క్, రాబడి సమానంగా ఉంటాయి.
చివరిగా: ఇండెక్స్ ఫండ్స్..డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్‌కు లోబడి ఉంటాయని గమనించాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
SSC: కానిస్టేబుల్(జీడీ) అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. పోస్టుల సంఖ్య 50,187కి పెంపు
-
India News
Flight Pilots: విమానంలో ఇద్దరు పైలట్లు ఒకే రకమైన ఆహారం ఎందుకు తీసుకోరు?
-
India News
Antibiotics: కొవిడ్ కేసుల పెరుగుదల వేళ.. యాంటిబయాటిక్స్‌పై కేంద్రం మార్గదర్శకాలు
-
Movies News
Amitabh Bachchan: గాయం నుంచి కోలుకున్న అమితాబ్.. సోషల్ మీడియాలో పోస్ట్
-
India News
Anand Mahindra: గతం వదిలేయ్.. భవిష్యత్తుపై హైరానావద్దు.. మహీంద్రా పోస్టు చూడాల్సిందే..!
-
Sports News
WPL: కీలక మ్యాచ్‌లో సత్తాచాటిన యూపీ.. గుజరాత్‌పై 3 వికెట్ల తేడాతో గెలుపు