Amazon prime day sale: అమెజాన్‌ సేల్‌.. ఐఫోన్‌, వన్‌ప్లస్‌ ఫోన్లపై డీల్స్‌ ఇవే..

amazon prime day sale: ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ (amazon prime day sale) మరో సేల్‌కు సిద్ధమైంది. కేవలం ప్రైమ్‌ మెంబర్ల కోసం జులై 23, 24 తేదీల్లో ఈ సేల్‌ జరగనుంది.

Published : 21 Jul 2022 13:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ (amazon prime day sale) మరో సేల్‌కు సిద్ధమైంది. కేవలం ప్రైమ్‌ మెంబర్ల కోసం జులై 23, 24 తేదీల్లో ప్రైమ్ డే సేల్‌ నిర్వహించబోతోంది. ఈ సేల్‌లో మొబైల్స్‌, ఇతర యాక్సెసరీస్‌పై తగ్గింపు ధరలకే విక్రయించడంతో పాటు SBI, ICICI బ్యాంకు కార్డులతో కొనుగోళ్లపై అదనంగా 10 శాతం డిస్కౌంట్స్‌ అందిస్తున్నారు. ముఖ్యంగా యాపిల్‌, శాంసంగ్‌, వన్‌ప్లస్‌, షావోమీ, రియల్‌మీ కంపెనీలకు చెందిన కొన్ని ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అమెజాన్‌ ప్రకటించింది. ఆ డీల్స్‌పై ఓ లుక్కేయండి..

ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్‌‌: ఐఫోన్‌ లేటెస్ట్‌ ఫోన్‌ 13 అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌లో భారీ డిస్కౌంట్‌కే లభిస్తోంది. ఈ ఫోన్‌ ఎమ్మార్పీ ₹79,900 ఉండగా.. ₹66,900కే ఈ సేల్‌లో విక్రయిస్తున్నారు. పాత ఐఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా అదనపు డిస్కౌంట్‌ పొందొచ్చు.

వన్‌ప్లస్‌ ఫోన్లపై ఈ డీల్స్‌: ఈ సేల్‌లో ముఖ్యంగా వన్‌ప్లస్‌ బ్రాండ్‌కు చెందిన మూడు ఫోన్లపై డిస్కౌంట్లు లభిస్తున్నాయి. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ2 5జీ ఫోన్‌ ఎమ్మార్పీ రూ.24,999 కాగా.. ఈ సేల్‌లో వెయ్యి రూపాయలు తక్కువకు విక్రయిస్తున్నారు. బ్యాంక్‌ ఆఫర్‌తో కొనుగోలు చేస్తే ₹22,499కే ఫోన్‌ దక్కించుకోవచ్చు. వన్‌ప్లస్‌ సీఈ2 లైట్‌ ఫోన్‌ను సైతం ఈ సేల్‌లో 19,999కి లభిస్తోంది. బ్యాంక్‌ ఆఫర్‌తో ₹17,499కే సొంతం చేసుకోవచ్చు. కొత్తగా లాంఛ్‌ అయిన వన్‌ప్లస్‌ నార్డ్‌ 2టీ వాస్తవ ధర ₹28,999.. ప్రైమ్‌ సేల్‌లో ₹27,499కే విక్రయిస్తున్నారు.

నార్జో 50ఏపై భారీ తగ్గింపు: రియల్‌మీ నార్జో 50ఏ ఫోన్‌పై ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ ఫోన్‌ రిటైల్‌ ధర ₹ 11,499 కాగా.. ఈ సేల్‌లో ₹8,999కే (బ్యాంక్‌ ఆఫర్‌ కలుపుకొని) అమ్ముతున్నారు.

బడ్జెట్‌లో బెస్ట్‌ మొబైల్‌ ఇదే: బడ్జెట్‌లో మంచి ఫోన్‌ కోసం చూస్తున్న వారికి ఈ సేల్‌లో రెడ్‌మీ నోట్‌ 11పై ఓ లుక్‌ వేయొచ్చు. 50 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 33w ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం, సూపర్‌ ఆమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తున్న ఈ మొబైల్‌ను ప్రస్తుతం ₹13,499కి విక్రయిస్తున్నారు. ఈ సేల్‌లో బ్యాంక్‌ ఆఫర్లు కలుపుకొని దీన్ని కేవలం ₹10,749కే సొంతం చేసుకోవచ్చు.

ఈ ఫోన్లపైనా ఓ లుక్కేయొచ్చు

  • బడ్జెట్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తున్న వారు ఐకూ జడ్‌6 5జీ ఫోన్‌పై ఓ లుక్కేయొచ్చు. ఈ ఫోన్‌ రూ.15,499కి విక్రయిస్తుండగా.. సేల్‌ సమయంలో రూ.12,999కే లభించనుంది. అలాగే శాంసంగ్‌ ఎం 13పై ఈ సేల్‌లో ₹2వేలు డిస్కౌంట్‌ లభిస్తోంది. ₹9999కే దీన్ని కొనుగోలు చేయొచ్చు.
  • శాంసంగ్‌ బ్రాండ్‌ను ఇష్టపడే వారు ఎం33 5జీ ఫోన్‌ను ఈ సేల్‌లో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. రిటైల్‌ ధర ₹18,999 కాగా.. ఈ సేల్‌లో ₹15,499కే కొనుగోలు చేయొచ్చు.
  • వీటితో పాటు ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఇయర్‌ ఫోన్స్‌, టీవీలు తగ్గింపు ధరలకే లభిస్తున్నాయి. ఈ సేల్‌లో పాల్గొనాలంటే మీరు ప్రైమ్‌ మెంబర్‌ అయ్యి ఉండాలి. ఒకవేళ మీరు ప్రైమ్‌ మెంబర్‌ కాకుంటే నెల, మూడు నెలలు, ఏడాది ప్లాన్లు తీసుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు ప్రైమ్‌ మెంబర్‌ కాకపోయి ఉంటే అమెజాన్‌ ఫ్రీ ట్రయల్‌ను ఆఫర్‌ సమయంలో వినియోగించుకోవచ్చు.
Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని