సీనియర్ సిటిజన్స్ కోసం ఆరోగ్య బీమా పాలసీలు
బీమా సంస్థలు సీనియర్ సిటిజన్ల కోసం ఆరోగ్య బీమా పాలసీలను ప్రవేశపెట్టినప్పటికీ, వాటి మినహాయింపులు, పరిమితులు ఎక్కువగా ఉన్నాయి.
దేశంలోవైద్య ద్రవ్యోల్బణం భారీ గా పెరుగుతోంది. కొత్త వైద్య విధానాలు అభివృద్ధి చెందడంతో, ఆరోగ్య ఖర్చులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. పెద్ద వయస్సు వారికి ఆరోగ్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. పదవీ విరమణ తర్వాత వచ్చే తక్కువ పెన్షన్ తో వైద్య ఖర్చులకు సరైన డబ్బు అందక సీనియర్ సిటిజన్ల అనేక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. చాలా కంపెనీలు సీనియర్ సిటిజన్ల కోసం ఆరోగ్య బీమా పాలసీలను ప్రవేశపెట్టినప్పటికీ, వాటి మినహాయింపులు, పరిమితులు ఎక్కువగా ఉన్నాయి.
సీనియర్ సిటిజన్లకు ఆందోళన కలిగించే ముఖ్యమైన పరిమితులను కింద తెలియచేశాము :
అధిక ప్రీమియం: సీనియర్ సిటిజన్ల కు అందించే ఆరోగ్య బీమా పాలసీలపై
ప్రీమియం రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో, ఇవి మన స్థాయికి మించి ఉంటాయి. కానీ వీటిని తీసుకోక తప్పదు. ఎందుకంటే మనకు ఇంకొక ఆప్షన్ లేదు. ఆరోగ్య బీమా లేకుండా ఉంటే మీరు అప్పటి వరకు పొదుపు చేసుకున్న మొత్తాన్ని ఆసుపత్రి ఖర్చుల కోసం వినియోగించాల్సి రావచ్చు.
కో - పేమెంట్ అంటే?
సీనియర్ సిటిజన్ల ఆరోగ్య బీమా పాలసీలలో, క్లెయిమ్ మొత్తంలో కొంత భాగం సీనియర్ సిటిజన్లు చెల్లించవలసి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని మాత్రమే బీమా కంపెనీలు చెల్లింస్తుంటాయి. అంటే బీమా సంస్థ పూర్తి మొత్తాన్ని చెల్లించదు. దీన్నే సహా-చెల్లింపు (కో - పేమెంట్ ) అని పిలుస్తారు. సీనియర్ సిటిజన్ల ఆరోగ్య బీమా కోసం బీమా సంస్థలు 10 శాతం నుంచి 50 శాతం కో - చెల్లింపులను డిమాండ్ చేస్తున్నాయి.
బీమా / కవరేజ్ మొత్తంలో పరిమితులు:
సీనియర్ సిటిజన్ల కోసం ఆరోగ్య బీమాను అందించడంలో చాలా బీమా సంస్థలు కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. కొందరైతే బీమా మొత్తాన్ని రూ.1- రూ.3 లక్షలకు పరిమితం చేశారు.
కొన్ని బీమా సంస్థలు మాత్రమే సీనియర్ సిటిజన్ల కోసం రూ. 5 లక్షల వరకు బీమా మొత్తాన్ని అందిస్తున్నాయి.
ముందుగా ఉన్న వ్యాధులకై వెయిటింగ్ పీరియడ్ :
బీమా సంస్థలు సీనియర్ సిటిజన్ల కు అందించే ఆరోగ్య బీమా పాలసీల వెయిటింగ్ పీరియడ్ 3 నుంచి 4 సంవత్సరాలుగా ఉంటుంది. ఈ వెయిటింగ్ పీరియడ్ లో ముందుగా ఉన్న వ్యాధులకు సంబంధించి ఏదైనా క్లెయిమ్ కు వస్తే, వాటికయ్యే చికిత్స ఖర్చులను బీమా సంస్థలు చెల్లించవు.
తల్లిదండ్రులకు లేదా సీనియర్ సిటిజన్ల కోసం ఉత్తమ ఆరోగ్య బీమా ఏమిటి?
నేషనల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అస్యూరెన్స్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు తక్కువ హామీ మొత్తంతో అలాగే తక్కువ కో - చెల్లింపు నిబంధనతో పాలసీలను అందిస్తున్నాయి. ఒకవేళ మీరు చిన్న నగరాలలో నివసిస్తున్నట్లైతే, ఇలాంటి పాలసీలను ఎంచుకోవచ్చు. అలాంటి ప్రాంతాల్లో వైద్య ఖర్చులు తక్కువగా ఉండడమే దీనికి కారణం. కానీ నగరాల్లో లేదా మెట్రోల్లో నివసించే వారికి మాత్రం ఈ పాలసీ కవరేజ్ సరిపోదు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, బజాజ్ అలియాంజ్, అపోలో మ్యూనిచ్, మాక్స్ బుపా వంటి బీమా సంస్థలు సీనియర్ సిటిజన్లకు అదనపు సదుపాయాలతో ఆరోగ్య బీమాను అందిస్తున్నాయి.
ప్రీమియం కాస్త ఎక్కువైనా ఫర్వాలేదనుకుంటే ఈ బీమా పాలిసీలను తీసుకోవడం ఉత్తమం. కానీ కొన్ని బీమా పాలసీలు ముందుగా ఉన్న వ్యాధులకు అధిక కో - చెల్లింపు నిబంధనతో పాటు ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ తో పాలసీలను అందిస్తున్నాయి.
సీనియర్ సిటిజన్ల కోసం అందుబాటులో ఉన్న కొన్ని పాలసీలు:
సీనియర్ సిటిజన్ల కొరకు ప్రముఖ ఆరోగ్య బీమా పాలసీల వివరాలు కింద తెలియజేశాం.
దాదాపు అన్ని రకాల ఆరోగ్య బీమా పాలసీలకు వైద్య పరీక్షలు అవసరం. అయితే, పాలసీని కొనుగోలు చేయడానికి ముందు, పాలసీ నిబంధనలను ను పూర్తిగా చదవండి. ఇది పాలసీ క్లెయిమ్ సమయంలో మీకు ఎంతగానో సహాయపడుతుంది.
నేషనల్ ఇన్సూరెన్స్ వరిస్తా మెడిక్లైమ్ పాలసీ:
ప్రీమియం రేటు తక్కువగా ఉన్నప్పటికీ, ఈ పాలసీ అందించే గరిష్ట కవర్ రూ. 2 లక్షలు మాత్రమే.
వయస్సు : 60 - 80 సంవత్సరాలు
గరిష్ట కవరేజ్ : రూ. 1,00,000 మెడిక్లెయిమ్ అలాగే రూ. 2,00,000 క్రిటికల్ ఇల్నెస్
ముందుగా ఉన్న వ్యాధులు: ముందుగా ఉన్న వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్ ఒక సంవత్సరం
వెయిటింగ్ పీరియడ్ అనేది మెడి క్లెయిమ్ కు 30 రోజులు అలాగే క్రిటికల్ ఇల్నెస్ కు 90 రోజులుగా ఉంటుంది.
ఒకవేళ మీకు గత 3 సంవత్సరాలలో ఎలాంటి ఆరోగ్య బీమా పాలసీ లేనట్లయితే తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది. పాలసీ లోని మంచి విషయం ఏమిటంటే మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు పాలసీ ప్రారంభం నుంచి కవర్ అవుతాయి. పాలసీ మంచిదైనప్పటికీ, కవరేజ్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. ఆరోగ్య బీమా ఖర్చులు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో రూ.1 లక్ష ఆరోగ్య బీమా కవరేజ్ అనేది మీ తల్లిదండ్రులకు సరిపోకపోవచ్చు.
న్యూ ఇండియా అస్యూరెన్స్ మెడిక్లెయిమ్ పాలసీ:
వయస్సు : 60 - 80 సంవత్సరాలు
కనిష్ట కవరేజ్ : రూ. 1,00,000
గరిష్ట కవరేజ్ : రూ. 1,50,000
ముందుగా ఉన్న వ్యాధులు: పాలసీ ద్వారా 18 నెలల వెయిటింగ్ పీరియడ్ అనంతరం ముందుగా ఉన్న వ్యాధులకు కవరేజ్ లభిస్తుంది.
ఈ పాలసీలో గరిష్ట వయస్సు 80 సంవత్సరాలు అయినప్పటికీ, పాలసీ ప్రీమియంను క్రమం తప్పకుండా చెల్లించినట్లైతే మీ తల్లిదండ్రులకు 90 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఆరోగ్య బీమాను కొనసాగించుకోవచ్చు. ఈ పాలసీలో కూడా హామీ మొత్తం తక్కువగా ఉంటుంది. మీ తల్లిదండ్రులకు రూ. 1.5 లక్షల కవరేజ్ సరిపోతుందా లేదా అనేది నిర్ణయించుకోవాలి.
స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి రెడ్ కార్పెట్ పాలసీ :
ఈ పాలసీని 60 నుంచి 75 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారికోసం కొనుగోలు చేయవచ్చు. దీనికి ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా ఉన్న వ్యాధులకు 50 శాతం ఆలాగే మిగిలిన వ్యాధులలో 30 శాతం సహ - చెల్లింపు ఉంటుంది. ఈ పాలసీని రూ.10 లక్షల వరకు హామీ మొత్తంతో కొనుగోలు చేయవచ్చు. కానీ ప్రభుత్వ రంగ సంస్థల ప్రీమియంతో పోలిస్తే ఈ పాలసీ ప్రీమియం ఎక్కువ.
వయస్సు: 60 నుంచి 75 సంవత్సరాలు
గరిష్ట కవరేజ్: రూ. 10,00,000
ముందుగా ఉన్న వ్యాధులు: 12 నెలల వెయిటింగ్ పీరియడ్ తర్వాత ముందుగా ఉన్న వ్యాధులు కవర్ అవుతాయి.
బీ పీ, షుగర్, ఒత్తిడి, బ్లడ్ యూరియా రిపోర్టులను సమర్పించిన వినియోగదారులకు ప్రీమియంలో 10 శాతం డిస్కౌంట్ ను సంస్థ అందిస్తుంది. దీనికి వెయిటింగ్ పీరియడ్ 30 రోజులు. ఉదాహరణకు రాజు అనే వ్యక్తి వయస్సు 60 సంవత్సరాలు. ఇటీవలే అతను ఐటీ సంస్థ నుంచి పదవీ విరమణ చేశాడు. అతను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి రెడ్ కార్పెట్ పాలసీని రూ. 10 లక్షల కవరేజ్ తో కొనుగోలు చేశాడు. అతను తన పాలసీని 5 సంవత్సరాల పాటు ప్రీమియంను చెల్లించి కొనసాగించాడు . 65 సంవత్సరాల వయస్సులో అతనికి కార్డియో వాస్కులర్ వ్యాధి నిర్ధారణ జరిగింది. చికిత్స, ఆసుపత్రి ఖర్చుల నిమితం రూ. 10 లక్షలు ఖర్చయ్యాయి.
బజాజ్ అలియాన్జ్ సిల్వర్ హెల్త్ పాలసీ:
ఈ పాలసీ కింద 70 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారికి రూ. 5 లక్షల వరకు కవరేజ్ లభిస్తుంది.
వయస్సు: 46 - 70 సంవత్సరాలు
గరిష్ట కవరేజ్: రూ. 5,00,000
ముందుగా ఉన్న వ్యాధులు: ముందుగా ఉన్న వ్యాధులు 12 నెలల వెయిటింగ్ పీరియడ్ తర్వాత కవర్ అవుతాయి.
నాన్ నెట్ వర్క్ ఆసుపత్రులు: ఒకవేళ మీరు నాన్ నెట్ వర్క్ ఆసుపత్రిలో చేరినట్లయితే 20 శాతం సహ - చెల్లింపును చేయవలసి ఉంటుంది, కానీ మీరు 15 శాతం అదనపు ప్రీమియం చెల్లించటానికి సిద్ధంగా ఉన్నట్లైతే, ఈ పాలసీలో సహ - చెల్లింపును రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. 15 శాతం అదనపు ప్రీమియం చెల్లించే ముందు, మీ నగరంలోని నెట్ వర్క్ ఆసుపత్రుల జాబితాను ఒకసారి తనిఖీ చేసుకోవడం మంచిది.
ఈ పాలసీని మీరు 46 సంవత్సరాల వయస్సులో కొనుగోలు చేయవచ్చు. ఈ పాలసీలోని మంచి విషయం ఏంటంటే జీవిత కాలం పునరుద్ధరణ చేసుకోవచ్చు. అయితే బజాజ్ అలియాన్జ్ అందించే సిల్వర్ ఆరోగ్య పాలసీ ప్రీమియంలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ పాలసీ లో ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి. ఈ పాలసీ లో మరో ప్రయోజనం ఏమిటంటే ఇద్దరూ లేదా అంతకన్నా ఎక్కువ మంది పాలసీ తీసుకున్నట్లైతే 5 శాతం తగ్గింపును కూడా పొందవచ్చు.
యునైటెడ్ ఆరోగ్య బీమా పాలసీ :
ఈ పాలసీ కింద 80 సంవత్సరాల వయస్సు వరకు ఉన్నవారికి రూ. 3 లక్షల వరకు కవరేజ్ లభిస్తుంది.
వయస్సు: 61 - 80 సంవత్సరాలు
గరిష్ట కవరేజ్: రూ. 3,00,000
ముందుగా ఉన్న వ్యాధులు: ముందుగా ఉన్న వ్యాధులు 48 నెలల వెయిటింగ్ పీరియడ్ తర్వాత కవర్ అవుతాయి.
పాలసీలో వెయిటింగ్ పీరియడ్ 48 నెలలు అయినప్పటికీ, హైపర్ టెన్షన్, మధుమేహం, హెర్నియా, పైల్స్, కంటిశుక్లం వంటి కొన్ని రకాల వ్యాధులు 24 నెలల వెయిటింగ్ పీరియడ్ తర్వాత కవర్ అవుతాయి.
సీనియర్ సిటిజన్ల కోసం ఓరియంటల్ ఇన్సూరెన్స్ నుండి సీనియర్ సిటిజెన్ హోప్ పాలసీ :
ఈ పాలసీ కింద 80 సంవత్సరాల వయస్సు వరకు ఉన్నవారికి రూ. 5 లక్షల వరకు కవరేజ్ లభిస్తుంది.
వయస్సు: 61 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ
గరిష్ట కవరేజ్: రూ. 5,00,000
ముందుగా ఉన్న వ్యాధులు: ముందుగా ఉన్న వ్యాధులు 24 నెలల వెయిటింగ్ పీరియడ్ తర్వాత కవర్ అవుతాయి.
ఈ పాలసీలో సహ - చెల్లింపును ఎంచుకునే అవకాశం ఉంటుంది. ప్రీమియం మొత్తం అనేది మీరు ఎంచుకున్న ఆప్షన్ ప్రకారంఉంటుంది. అలాగే, ఒకవేళ మీరు 10 శాతం సహ - చెల్లింపును ఎంచుకున్నట్లైతే, పాలసీ ప్రీమియంపై 10 శాతం రాయితీని కూడా పొందుతారు. ఒకవేళ మీరు 20 శాతం సహ - చెల్లింపును ఎంచుకుంటే 20% రాయితీని పొందుతారు.
అపోలో మ్యూనిచ్ ఆప్టిమా సీనియర్ పాలసీ :
ఈ పాలసీ కింద 80 సంవత్సరాల వయస్సు వరకు ఉన్నవారికి రూ. 5 లక్షల వరకు కవరేజ్ లభిస్తుంది.
వయస్సు : 61 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ
గరిష్ట కవరేజ్: రూ. 5,00,000
ముందుగా ఉన్న వ్యాధులు: ముందుగా ఉన్న వ్యాధులు 36 నెలల వెయిటింగ్ పీరియడ్ తర్వాత కవర్ అవుతాయి.
ఈ పాలసీలో సహ - చెల్లింపు కోసం రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అవి 15 శాతం, 30 శాతం. ఒకవేళ మీరు 15 శాతం సహ - చెల్లింపును ఎంచుకున్నట్లైతే, మీరు ఆసుపత్రిలో చేరిన సమయంలో షేరింగ్ గదిని తీసుకోవాల్సి ఉంటుంది. అదే మీరు 30 శాతం సహ - చెల్లింపును ఎంచుకున్నట్లైతే, ప్రత్యేకంగా ఒక గదిని తీసుకోవచ్చు.
సీనియర్ సిటిజన్ల కోసం మెడికల్ ఎమర్జెన్సీ ఫండ్ :
సీనియర్ సిటిజన్ల కోసం అందిస్తున్న ఆరోగ్య బీమా పాలసీలలో ఎన్నో పరిమితులు, షరతులు ఉన్నందున, మీ ఇంట్లో ఉన్న సీనియర్ సిటిజన్ల కోసం మెడికల్ ఎమర్జెన్సీ ఫండ్ ను ఏర్పాటు చేసుకోవడం మంచిది. అంతేకాకుండా, ఆరోగ్య సంరక్షణ వ్యయం అధికంగా ఉన్న సమయంలో బీమా సంస్థలు పూర్తి మొత్తాన్ని చెల్లించవు. అటువంటి పరిస్థితుల్లో మెడికల్ ఎమర్జెన్సీ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
కానీ సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ఆరోగ్య బీమా లేనట్లయితే, వైద్య ఖర్చుల కోసం మీరు అనేక ఇబ్బందులను ఎదుర్కునే అవకాశం ఉంది. అందువలన మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే జీవితకాల ఆరోగ్య బీమా కవరేజ్ పొందే విధంగా మీకు, మీ కుటుంబానికి ఒక పాలసీని కొనుగోలు చేయండం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!