6 రెట్లు ఓవ‌ర్ స‌బ్‌స్క్రైబ్ అయిన 3వ విడ‌త భార‌త్ బాండ్ ఈటీఎఫ్‌

భార‌త్ బాండ్ ఈటీఎఫ్ 3వ విడ‌త డిసెంబ‌ర్ 3న ప్రారంభించ‌బ‌డింది, డిసెంబ‌ర్ 9, 2021న ముగిసింది.

Updated : 11 Dec 2021 11:26 IST

భార‌త్ బాండ్ ఈటీఎఫ్ 3వ విడ‌త డిసెంబ‌ర్ 3న ప్రారంభించ‌బ‌డింది, డిసెంబ‌ర్ 9, 2021న ముగిసింది. బేస్ ఇష్యూ ప‌రిమాణం రూ. 1,000 కోట్ల‌తో పోలిస్తే 6.2 రెట్లు ఓవ‌ర్ స‌బ్‌స్క్రైబ్ అయ్యింది. భార‌త్ బాండ్ ఈటీఎఫ్ అనేది ప్ర‌భుత్వ రంగ రుణ సంస్థ‌ల‌లో పెట్టుబ‌డి పెట్టే ఎక్స్ఛేంజ్ - ట్రేడెడ్ ఫండ్‌. ఈటీఎఫ్ ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల `ఏఏఏ` రేటింగ్ బాండ్ల‌లో మాత్ర‌మే పెట్టుబ‌డి పెడుతుంది. భార‌త్ బాండ్ ఈటీఎఫ్ 2032 న్యూ ఫండ్ ఆఫ‌ర్ (ఎన్ఎఫ్ఓ)లో వీప‌రీత‌మైన స్పంద‌న క‌నిపించింది. మొత్తం సేక‌ర‌ణ రూ. 6,200 కోట్ల‌కు పైగా ఉంది. 

రిటైల్ పెట్టుబ‌డిదారుల పెట్టుబ‌డుల‌ను సాధార‌ణ మ్యూచువ‌ల్ ఫండ్‌లాగా కొనుగోలు చేయ‌డం / అమ్మ‌డానికి వీలుగా ఈ ఈటీఎఫ్ కోసం ఫండ్ హౌస్ `ఫండ్ ఆఫ్ ఫండ్‌`ని కూడా ప్రారంభించింది. కొనుగోలుదారులు బాండ్‌లు మెచ్యూరిటీ వ‌ర‌కు ఉంచిన‌ట్ల‌యితే భార‌త్ బాండ్ ఈటీఎఫ్‌లు ప్ర‌భుత్వ యాజ‌మాన్యంలోని `ఏఏఏ` రేటేడ్ ప‌బ్లిక్ సెక్టార్ బాండ్ల‌లో పెట్టుబ‌డి పెట్ట‌డం వ‌ల‌న  అధిక భ‌ద్ర‌త‌తో అధిక స్థాయి రాబ‌డిని అందిస్తాయ‌ని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని