భార‌త్-22 ఈటీఎఫ్ వివ‌రాలు

కేంద్ర‌ప్ర‌భుత్వం పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ కార్య‌క్ర‌మంలో భాగంగా చేప‌డుతున్న కార్య‌క్ర‌మం ద్వారా నిధులు స‌మీక‌రిస్తుంది. రెండో విడ‌త భార‌త్ ఈటీఎఫ్ ద్వారా రూ. 6000 కోట్లు స‌మీక‌రించ‌నుంది. ఈ ఆఫ‌ర్ అధిక స‌బ్‌స్క్రిబ్ష‌న్ అయితే రూ.2400 కోట్లుఅధికంగా స‌మీక‌రించేందుకు అవ‌కాశం ఉంది.....

Published : 18 Dec 2020 12:44 IST

భార‌త్-22 ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) రెండో ద‌ఫా జూన్ 19,2018 నుంచి ప్రారంభం కానుంది.​​​​​​​

కేంద్ర‌ప్ర‌భుత్వం పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ కార్య‌క్ర‌మంలో భాగంగా చేప‌డుతున్న కార్య‌క్ర‌మం ద్వారా నిధులు స‌మీక‌రిస్తుంది. రెండో విడ‌త భార‌త్ ఈటీఎఫ్ ద్వారా రూ. 6000 కోట్లు స‌మీక‌రించ‌నుంది. ఈ ఆఫ‌ర్ అధిక స‌బ్‌స్క్రిబ్ష‌న్ అయితే రూ.2400 కోట్లుఅధికంగా స‌మీక‌రించేందుకు అవ‌కాశం ఉంది.

భార‌త్-22 ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్), ఎస్ అండ్ పీ భార‌త్ 22 కంపెనీల్లో పెట్టుబ‌డి చేస్తుంది. ఈ ఫండ్ ప్ర‌భుత్వ రంగంలో కొన‌సాగుతున్న‌, ప్ర‌భుత్వ భాగ‌స్వామ్యం క‌లిగిన సంస్థ‌ల‌లో పెట్టుబ‌డులు చేస్తుంది.

దీన్నిన‌ష్ట‌భ‌యం అధికంగా క‌లిగిన పెట్టుబ‌డి సాధ‌నంగా చెప్పాలి. ఎందుకంటే ఈక్విటీ లో దాదాపు 95-100 శాతం పెట్టుబ‌డులు చేసేలా, 0-5 శాతం స్వ‌ల్ప‌కాలిక స్థిరాదాయ పెట్టుబ‌డి సాధ‌నాల్లో పెట్టుబ‌డి సాధ‌నాల్లో మ‌దుపు చేసేలా ఫండ్ నిర్మాణం ఉంది. అధిక శాతం ఈక్విటీ పెట్టుబ‌డి సాధ‌నాల్లో మ‌దుపుచేస్తుంది కాబ‌ట్టి అస్తిర‌త ఎక్కువ‌గా ఉండొచ్చు. దీర్ఘ‌కాలంలో దీన్ని అధిగ‌మించి మంచి రాబ‌డిని పొందే అవ‌కాశ‌మూ లేక‌పోలేదు.

మార్కెట్లో లిస్ట‌యిన 22 కంపెనీల‌ను ఎంచుకుని వాటిలో పెట్టుబ‌డి చేస్తుంది. కింది ప‌ట్టిక‌లో ఆ వివ‌రాలు, వాటి వెయిటేజీ శాతం చూడ‌వ‌చ్చు. భారత్ 22 ఇండెక్స్ పనితీరును ప్రతిబింబిస్తుంది

BHARAT-22-W.png

భార‌త్ -22 ఈటీఎఫ్ వివ‌రాలు

విభిన్నమైన పెట్టుబడులు:

ఎస్ అండ్ పీ భారత్ 22 సూచీలో వివిధ రంగాల‌కు చెందిన బహుళ సంస్థలు ఉన్నాయి.దీంతో ఈ ఈటీఎఫ్ లో మ‌దుపుచేయ‌డం వ‌ల్ల విభిన్న సంస్థ‌ల్లో పెట్టుబ‌డి చేసిన‌ట్లు అవుతుంది. పారిశ్రామిక, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, యుటిలిటీస్, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, ప్రాథమిక సామగ్రిలలో భారత్ 22 ఇండెక్స్లో ఉన్న రంగాలూ ఉన్నాయి.

స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులు తమ లావాదేవీలను పూర్తి చేయడానికి అనుమతిస్తుంది. అంతేకాకుండా, ఫండ్ హౌస్ నుంచి నేరుగా క్ర‌య‌విక్ర‌యాలు చేయ‌వ‌చ్చు.

తక్కువ వ్యయ నిష్పత్తి:

భారత్ 22 ఈటీఎఫ్ ఇత‌ర క్రియాశీల‌క మ్యూచువల్ ఫండ్లతో పోలిస్తే తక్కువ వ్యయ నిష్పత్తి కలిగి ఉంది. గ‌రిష్ట ప‌రిమితి 0.0095% . తక్కువ వ్యయ నిష్పత్తి ఫలితంగా, దీర్ఘకాలంలో వీటిపై వ‌చ్చే రాబడి ఎక్కువగా ఉంటుందని అంచనా.

వార్షిక పునర్వ్యవస్థీకరణ :

భారత్ 22 ఇండెక్స్ వార్షిక పునఃసృష్టి విధానాన్ని కలిగి ఉంటుంది. ఈ పథకం లో ఉన్న పెట్టుబడులలో సంవ‌త్స‌రానికి ఒక సారి మార్పులు చేర్పులు చేస్తుంది.

మ‌దుప‌ర్లుకు 2.5 శాతం రాయితీ:

ఈ ఈటీఎఫ్ లో పెట్టుబడులు చేసే మ‌దుప‌ర్ల‌కు ప్రభుత్వం 2.5 శాతం రాయితీ అందిస్తోంది.

b-22.png

ద‌ర‌ఖాస్తుచేయండిలా…

దరఖాస్తుదారులు ఐసీఐసీఐ ప్రడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ లేదా కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇన్వెస్టర్ సర్వీస్ సెంటర్స్ వద్ద దరఖాస్తును అంద‌జేయ‌వ‌చ్చు. వీటితో పాటు వివిధ ర‌కాల ఫ్లాట్ ఫామ్ ల‌ద్వారా ఈ ఈటీఎఫ్ అందుబాటులో ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని