Airtel prepaid plans: ఎయిర్‌టెల్‌లో మరో 4 కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌లు

ప్రముఖ ప్రైవేటు టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ మరో నాలుగు కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను ప్రవేశపెట్టింది....

Published : 06 Jul 2022 12:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ప్రైవేటు టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ మరో నాలుగు కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను ప్రవేశపెట్టింది. నెలరోజుల వ్యాలిడిటీ కోసం వేచి చూస్తున్నవారికి ఈసారి కొత్త ప్యాక్‌లను తీసుకొచ్చింది. ఇప్పటికే ఉన్న రూ.99 ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. దీంతో తక్కువ ఖర్చుతో రీఛార్జ్‌ చేసుకోవాలనుకునేవారికి నెలరోజుల కాలపరిమితి ప్లాన్‌లను తీసుకొచ్చారు.

రూ.109, రూ.111 ప్లాన్‌లు..

నిజానికి ఈ రెండు ప్లాన్‌లు ఒకేరకమైన ప్రయోజనాలు అందిస్తున్నాయి. 200 ఎంబీ డేటా, రూ.99 టాక్‌టైం, లోకల్‌ ఎస్‌ఎంఎస్‌కు రూ.1, ఎస్‌టీడీ ఎస్‌ఎంఎస్‌కు రూ.1.5, కాల్స్‌కు ప్రతి సెకండ్‌కు 2.5 పైసలు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ రెండింటిలో వ్యాలిడిటీలు మాత్రమే భిన్నంగా ఉన్నాయి. రూ.109 ప్లాన్‌ వ్యాలిడిటీ 30 రోజులు కాగా.. రూ.111 ప్లాన్‌ కాలపరిమితి నెలరోజులు. అంటే జూన్‌ 1న రూ.111తో రీఛార్జ్‌ చేసుకుంటే తిరిగి జులై 1న చేసుకోవాల్సి ఉంటుంది. నెలలోని రోజులతో నిమిత్తం లేదు.

రూ.128, రూ.131 ప్లాన్‌లు..

భారతీ ఎయిర్‌టెల్‌ ప్రవేశపెట్టిన మరో రెండు కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌లు రూ.128, రూ.131తో వస్తున్నాయి. రూ.128 ప్లాన్‌ వ్యాలిడిటీ 30 రోజులు. రూ.131 ప్లాన్‌ కాలపరిమితి నెలరోజులు. ఈ రెండింటి ప్రయోజనాలు కూడా ఒకేరకంగా ఉన్నాయి. లోకల్‌, ఎస్‌టీడీ కాల్స్‌ ప్రతి సెకండ్‌కు 2.5 పైసలు, జాతీయ వీడియోకాల్స్‌కి ప్రతి సెకండ్‌కు 5 పైసలు, ప్రతి 1ఎంబీ డేటాకు 50పైసలు, లోకల్‌ ఎస్‌ఎంఎస్‌కు రూ.1, ఎస్‌టీడీ ఎస్‌ఎంఎస్‌కు రూ.1.5.. వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

నెలరోజుల కాలపరిమితి కోసం చూస్తున్నవారిని లక్ష్యంగా చేసుకొని ఈ ప్లాన్లను ప్రవేశపెట్టారు. వాస్తవానికి వీటిలో రూ.111, రూ.131 ప్యాక్‌లు మాత్రమే నెలరోజుల వ్యాలిడిటీతో వస్తున్నాయి. అంటే ఈ నెల ఏ తేదీనైతే రీఛార్జ్‌ చేసుకుంటారో వచ్చే నెల కూడా అదే తేదీన తిరిగి చేసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన రెండు ప్లాన్లలో మాత్రం తేదీతో సంబంధం లేకుండా 30 రోజులు గడవగానే రీఛార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు