Airtel Prepaid Plan: ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్‌టెల్‌ కొత్త ప్లాన్‌

దేశవ్యాప్తంగా ఉన్న తమ యూజర్ల కోసం ఎయిర్‌టెల్‌ కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను ప్రారంభించింది....

Updated : 03 May 2022 15:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా ఉన్న తమ యూజర్ల కోసం ఎయిర్‌టెల్‌ కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ (Airtel Prepaid Plan)ను ప్రారంభించింది. ఎక్కువ డేటా వినియోగించేవారికి ఇది సరైన ప్లాన్‌ అని ఎయిర్‌టెల్‌ (Airtel) వర్గాలు తెలిపాయి. పైగా ఇది ఓటీటీ (OTT) సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన ప్లాన్‌ కావడం విశేషం. దీని ధర రూ.999. మరి ఈ ప్లాన్‌ ప్రయోజనాలేంటో చూద్దాం..

ప్లాన్‌ వివరాలు..

  • డేటా: రోజుకి 2.5 జీబీ
  • కాల్స్‌: అపరిమితం
  • కాలపరిమితి: 84 రోజులు
  • ఎస్‌ఎంఎస్‌లు: రోజుకి 100 ఉచితం

అదనపు ప్రయోజనాలు...

  • 84 రోజుల వ్యాలిడిటీతో అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime) సభ్యత్వం
  • సోనీలివ్‌, లయన్స్‌గేట్‌ప్లే, ఈరోస్‌నౌ,హోయ్‌చొయ్‌, మనోరమామ్యాక్స్‌లలో ఏదైనా ఒక ఎక్స్‌ట్రీమ్‌ ఛానెల్‌కు 84 రోజుల పాటు అనుమతి
  • అపోలో 24/7 సర్కిల్‌ సేవలు మూడు నెలల పాటు ఉచితం
  • షా అకాడమీ వారి ఆన్‌లైన్‌ కోర్సులు ఉచితం
  • ఫాస్టాగ్‌ లావాదేవీలపై రూ.100 క్యాష్‌బ్యాక్‌
  • ఉచితంగా హలోట్యూన్స్‌
  • ఉచితంగా వింక్‌మ్యూజిక్‌
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని