Airtel Q1 results: అదరగొట్టిన ఎయిర్‌టెల్‌.. లాభం ఐదింతలు!

Airtel Q1 results: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. 

Published : 08 Aug 2022 22:30 IST

దిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ (Airtel) త్రైమాసిక ఫలితాల్లో (Q1 results) అదరగొట్టింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఐదింతల లాభాన్ని ఆర్జించింది. గతేడాది రూ.283.5 కోట్ల నికర లాభాన్ని గడించగా.. ఈ ఏడాది రూ.1607 కోట్లు సాధించింది. కంపెనీ ఆదాయం సైతం 24 శాతం పెరిగింది. గతేడాది రూ.18,828.4 కోట్లుగా ఉన్న ఆదాయం ప్రస్తుత ఏడాది రూ.23,319 కోట్లకు పెరిగింది.

ఒక్క మొబైల్‌ సేవల ఆదాయం 27 శాతం వృద్ధి చెందింది. గతేడాది రూ.14305.6 కోట్లుగా ఉన్న ఆదాయం రూ.18,220 కోట్లకు పెరిగింది. గతేడాది రూ.146గా ఉన్న వ్యక్తి నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) ఈ ఏడాది రూ.183కి పెరిగింది. సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెరగడం, టారిఫ్‌ల సవరణ వల్ల సగటు ఆదాయం పెరగడం వంటివి ఎయిర్‌టెల్‌ భారీ లాభాలకు దోహదం చేశాయి. ఎన్‌ఎస్‌ఈలో సోమవారం కంపెనీ షేరు 0.18 శాతం లాభంతో రూ.704.95 వద్ద ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని