Airtel Q2 results: ఎయిర్‌టెల్‌ లాభం 89 శాతం జంప్‌

Airtel Q2 results: ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్‌ త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి గానూ రూ.2145 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

Published : 31 Oct 2022 17:19 IST

దిల్లీ: ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్‌ త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి గానూ రూ.2145 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే లాభం 89 శాతం మేర పెరిగింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ లాభం రూ.1134 కోట్లుగా ఉంది.

కంపెనీ ఆదాయం సైతం 21.9 శాతం మేర వృద్ధి చెంది రూ.34,527 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.28,326 కోట్లుగా ఉందని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఒక యూజర్‌ నుంచి వచ్చే సగటు ఆదాయం సైతం (ARPU) రూ.183 నుంచి రూ.190కి పెరిగినట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది.

  • ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఎయిర్‌టెల్‌ రూ.2,145 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. గత త్రైమాసికంతో చూసినప్పుడు క్యూ2లో ఎయిర్‌టెల్‌ లాభం 33.5 శాతం వృద్ధి చెందింది. తొలి త్రైమాసికంలో రూ.34,130 కోట్లుగా నమోదైన ఆదాయం క్యూ2లో 5.3 శాతం మేర పెరిగింది.

టారిఫ్‌లపై మరోసారి..

త్రైమాసిక ఫలితాలపై ఎయిర్‌టెల్‌ సీఈఓ గోపాల్ విఠల్‌ మాట్లాడుతూ.. కంపెనీ 5జీని అందుబాటులోకి తెస్తోందని, ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ భారతదేశంలో అత్యుత్తమ అనుభవాన్నిఅందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రపంచంలోనే అత్యల్పంగా ఉన్న ధరల కారణంగా తక్కువ రిటర్న్‌ ఆఫ్‌ కాపిటల్‌ ఎంప్లాయీ (ROCE)పై ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. దేశంలో డిజిటల్‌ విస్తరణకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరం అని, దీనికి టారిఫ్‌ల సవరణ అవసరమని పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts