Q3 Results: ఎయిర్‌టెల్‌ లాభంలో 91 శాతం వృద్ధి.. ₹193కు ఆర్పూ

Airtel Q3 Results: మూడో త్రైమాసికంలో ఎయిర్‌టెల్‌ లాభం 91 శాతం పెరిగింది. ఆర్పూ రూ.193కు చేరింది.

Published : 07 Feb 2023 17:34 IST

దిల్లీ: టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ (Bharti Airtel) డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.1,588 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.829.6 కోట్ల లాభంతో పోలిస్తే 91 శాతం వృద్ధి నమోదైంది. ఒక్కో వినియోగదారుడిపై వచ్చే సగటు ఆదాయం (ARPU) రూ.163 నుంచి రూ.193కు పెరిగింది. కంపెనీ కార్యకలాపాల ఆదాయం వార్షిక ప్రాతిపదికన రూ.29,866 కోట్ల నుంచి 20 శాతం పెరిగి రూ.35,804 కోట్లకు చేరింది.

త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే ఆదాయంలో 3.7 శాతం వృద్ధి నమోదైనట్లు భారతీ ఎయిర్‌టెల్‌ ఎండీ గోపాల్‌ విఠల్‌ తెలిపారు. EBITDA మార్జిన్‌ 52 శాతం పెరిగినట్లు వెల్లడించారు. గత త్రైమాసికంలో కొత్తగా 6.4 మిలియన్ల కొత్త 4జీ కస్టమర్లు చేరినట్లు తెలిపారు. పోస్ట్‌పెయిడ్‌, ఎంటర్‌ప్రైజ్‌, హోమ్స్‌ విభాగంతో పాటు ఆఫ్రికా వ్యాపారంలోనూ వృద్ధి కొనసాగినట్లు పేర్కొన్నారు. ఒక్క డీటీహెచ్ వ్యాపారంలో మాత్రమే వృద్ధి నెమ్మదించినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని