Airtel Q3 results: ఎయిర్‌టెల్‌ నికర లాభాల్లో 3% క్షీణత

2021-22 ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ఏకీకృత ప్రాతిపదికన రూ.830 కోట్ల నికర లాభాలను ప్రకటించింది.....

Published : 08 Feb 2022 19:53 IST

ముంబయి: 2021-22 ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ఏకీకృత ప్రాతిపదికన రూ.830 కోట్ల నికర లాభాలను ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.854 కోట్ల లాభాలు నమోదు చేసింది. లాభాల్లో 2.8 శాతం క్షీణత నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.26,518 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం 12.6 శాతం పెరిగి ఈసారి రూ.29,867 కోట్లకు చేరింది. ఈ మేరకు మంగళవారం సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 

టారిఫ్‌లను పెంచడం, సబ్‌స్క్రైబర్ల సంఖ్యలో పెరుగుదల వల్ల ఆదాయానికి మద్దతు లభించిందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. వినియోగదారు సగటు ఆదాయం (ARPU) గతేడాది రూ.146 నుంచి ఈసారి రూ.163కు పెరిగినట్లు కంపెనీ తెలిపింది. సమీక్షించిన త్రైమాసికంలో ఎయిర్‌టెల్ దేశీయ ఆదాయం 18 శాతం పెరిగి రూ.20,913 కోట్లకు చేరింది. మొత్తంగా కంపెనీ ఫలితాలు విశ్లేషకుల అంచనాలను మాత్రం అందుకోలేకపోయాయి. ఈరోజు ట్రేడింగ్‌లో ఎయిర్‌టెల్‌ షేరు రూ.706.95 వద్ద ఫ్లాట్‌గా స్థిరపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని