Updated : 10 Aug 2022 11:54 IST

Airtel Data Voucher: ఎయిర్‌టెల్‌లో డేటా వోచర్‌తో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతీ ఎయిర్‌టెల్‌ (Bharti Airtel) రూ.148 డేటా వోచర్‌ (data voucher)తో 15 జీబీ ఎఫ్‌యూపీ (Fair-Usage-Policy) డేటా అందిస్తోంది. యాక్టివ్‌లో ఉన్న తాజా ప్లాన్‌లోనే దీన్ని యాడ్‌ చేసుకోవచ్చు. అయితే, దీంట్లో ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌లకు కూడా అనుమతి లభిస్తుండడం ప్రత్యేకత. ఈ వోచర్‌ పూర్తి వివరాలు..

* ఈ డేటా వోచర్‌తో 28 రోజుల గడువుతో ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీం ( Airtel Xstream) మొబైల్‌ ప్యాక్‌ కూడా వస్తోంది.

* సోనీలివ్‌, లయన్స్‌గేట్‌, ఈరోస్‌ నౌ, హొయ్‌చొయ్‌, మనోరమా మ్యాక్స్.. ఈ ఓటీటీల్లో ఏదో ఒకదాని సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.

* ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీం యాప్‌ ద్వారా మాత్రమే ఓటీటీ (OTT)లకు అనుమతి ఉంటుంది.

* ఎంపిక చేసుకున్న ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌కు 28 రోజుల వ్యాలిడిటీనే వర్తిస్తుంది.

* డేటా వోచర్‌ (data voucher) కాలపరిమితి మాత్రం ప్రస్తుతం ఉన్న బేస్‌ ప్లాన్‌ ముగిసే వరకు ఉంటుంది.

* ఎయిర్‌టెల్‌లో రూ.118 డేటా వోచర్‌ కూడా ఉంది. 12 జీబీ డేటా లభిస్తుంది. అయితే, ఎలాంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ ఉండదు.

* ఎయిర్‌టెల్‌లో అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime) మొబైల్‌ ఎడిషన్‌ సబ్‌స్క్రిప్షన్‌ కావాలంటే మాత్రం రూ.108 డేటా వోచర్‌ తీసుకోవాల్సిందే. అయితే, దీంట్లో 6 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని