పన్ను కట్టకపోతే.. ఇంటి ముందు దరువే!

ఆస్తి పన్నులు సకాలంలో చెల్లించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుంది. కానీ, కొందరు ఆస్తి పన్ను కట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు.

Published : 19 Feb 2021 23:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్తి పన్నులు సకాలంలో చెల్లించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుంది. కానీ, కొందరు ఆస్తి పన్ను కట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. అలాంటి మొండి బకాయిదారుల నుంచి పన్నులు వసూలు చేయడం కోసం మున్సిపల్‌ అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్నిసార్లు భారీగా రాయితీలు ప్రకటిస్తారు. భారీగా పన్నులు బాకీ ఉంటే నోటీసులు పంపుతుంటారు. అయితే, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ మున్సిపాలిటీ మాత్రం ఆస్తి పన్ను కట్టని వారికి తగిన బుద్ధి చెప్పడం కోసం వినూత్న కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. అదేంటంటే..

త్వరలో భోపాల్‌ పురపాలక పరిధిలో ఆస్తి పన్నులు కట్టని వారి ఇంటి ముందు మున్సిపల్‌ అధికారులు భారీ డ్రమ్స్‌తో దరువు వేయిస్తారట. వారి ఇంటి గోడలకు, వీధుల్లో పన్ను ఎగవేతదారు అంటూ యజమాని ఫొటో.. ఆస్తి వివరాలు.. బాకీ ఉన్న ఆస్తి పన్ను ఎంతో తెలిపే పోస్టర్లను అతికించనున్నారు. దీంతో ఇంటి యజమానులు వీధిలో పరువు పోతుందని.. పన్ను చెల్లిస్తారని అధికారులు భావిస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఆస్తి పన్ను వసూలు కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇచ్చిన గడువులోపు ఆస్తి పన్ను చెల్లించాలని ప్రజలను అభ్యర్థించేవారట. కానీ, దీనికి సరైన స్పందన రాకపోవడంతోనే డ్రమ్స్‌ వాయించే కార్యక్రమం అమలు చేయనున్నట్లు మున్సిపల్‌ అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి..

రూ. 50లక్షలకు మించి ప్రాపర్టీ కొంటున్నారా?

ఇల్లు హోల్డింగ్‌ పీరియడ్‌ ఎంత ఉంటే పన్ను మినహాయింపు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని