Bikaji Foods IPO: బికజీ ఫుడ్స్‌ ఐపీఓకు 26.67 రెట్ల స్పందన

బికజీ ఫుడ్స్‌ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ గడువు ముగిసింది. చివరి రోజైనా సోమవారం నాటికి ఈ ఐపీఓకు 26.67 రెట్ల స్పందన లభించింది.

Published : 07 Nov 2022 20:13 IST

దిల్లీ: బికజీ ఫుడ్స్‌ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ గడువు ముగిసింది. చివరి రోజైనా సోమవారం నాటికి ఈ ఐపీఓకు 26.67 రెట్ల స్పందన లభించింది. మొత్తం రూ.881.22 కోట్లను సమీకరించే లక్ష్యంతో ఐపీఓకు వచ్చిన ఈ కంపెనీ.. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిన మొత్తం 2,06,36,790 షేర్లను విక్రయానికి ఉంచింది. ఇందుకు గానూ 55,04,00,900 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. 

అర్హులైన సంస్థాగత మదుపర్ల (క్యూఐబీ) కోటాలో ఉంచిన షేర్లకు 80.63 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌ లభించింది. సంస్థాగేతర మదుపర్ల నుంచి 7.10 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి 4.77 రెట్లు మేర సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారు. ఐపీఓ ధరల శ్రేణిని రూ.285- 300గా నిర్ణయించారు. యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.262 కోట్లు సమీకరించినట్లు బికజీ ఫుడ్స్‌ గురువారం వెల్లడించింది. బికజీ బుజియాతో పాటు రసగుల్లా, సోన్‌ పాపిడి, గులాబ్‌జామ్‌లను ప్యాక్‌ చేసి ఈ కంపెనీ విక్రయిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని