Bill Gates: భారత టీకా తయారీ సామర్థ్యంపై బిల్‌గేట్స్ ప్రశంసలు
ప్రపంచవ్యాప్తంగా అందుబాటు ధరలో వ్యాక్సిన్లు అందజేసేందుకు భారత ఔషధ తయారీ సంస్థలు కృషిని బిలియనీర్ బిల్ గేట్స్ కొనియాడారు....
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా అందుబాటు ధరలో వ్యాక్సిన్లు అందజేసేందుకు భారత ఔషధ తయారీ సంస్థలు చేస్తున్న కృషిని బిలియనీర్ బిల్ గేట్స్ కొనియాడారు. టీకాల తయారీలో భారత్‌కు ఉన్న సామర్థ్యాన్ని ఆయన ప్రశంసించారు. భారత ఎంబసీ మంగళవారం నిర్వహించిన ‘ఇండియా-యూఎస్ హెల్త్ పార్ట్నర్షిప్’ రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత ఏడాది వ్యవధిలో భారత్ నుంచి దాదాపు 150 మిలియన్ల కొవిడ్-19 వ్యాక్సిన్లు 100 దేశాలకు చేరాయని గేట్స్ చెప్పారు. భారత పరిశ్రమల వల్లే ఈరోజు ప్రపంచంలోని ప్రతిదేశం తమ పిల్లలకు అన్ని రకాల టీకాలను అందించగలుగుతుందన్నారు. ఫలితంగా నిమోనియా, రోటోవైరస్ వంటి ప్రాణాంతక జబ్బుల నుంచి చిన్నారులకు రక్షణ లభిస్తోందన్నారు.
కొవిడ్ మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతుందన్నారు. దీన్ని కట్టడి చేయడంతో పాటు భవిష్యత్తులో రాబోయే మహమ్మారులను నివారించేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని బిల్‌గేట్స్ నొక్కి చెప్పారు. భారత్‌కు శాస్త్రసాంకేతికలో ఉన్న నైపుణ్యాన్ని ఒడిసిపట్టి ప్రపంచ ఆరోగ్యానికి కృషి చేస్తామన్న మోదీ ప్రకటనను ఈ సందర్భంగా గేట్స్ గుర్తుచేశారు. ఇది ఉమ్మడి లక్ష్యం కావాలని తెలిపారు. ఇది వాస్తవరూపం దాల్చాలంటే.. భాగస్వామ్యాలు చాలా కీలకమన్నారు. కొవాగ్జిన్, కోర్బావాక్స్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లు.. సీమాంతర ఒప్పందాలు, వివిధ రంగాల మధ్య ఏర్పడిన భాగస్వామ్యాల వల్లే సాధ్యమయ్యాయన్నారు. ‘బయో ఇ’తో క్వాడ్ సభ్యదేశాలు చేసుకున్న ఒప్పందం కూడా అందుకు నిదర్శనమన్నారు.
కొవిడ్-19 ముప్పు తగ్గినప్పటికీ.. కొత్త మహమ్మారి ప్రమాదం మాత్రం పొంచి ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తయారీదార్లు, ఇతర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా పెట్టుబడులు సైతం పెంచాలని హితవు పలికారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్‌లో సిక్స్‌లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM