Harsh Mariwala: సామాన్యుడిలా సూపర్‌ మార్కెట్‌కు బిలియనీర్‌.. ఇంతకీ ఎవరీయన?

Harsh Mariwala: ముంబయిలోని ఓ దుకాణంలో కస్టమర్లతో కనిపించి నెటిజన్లను ఆశ్చర్యపరిచారు మారికో వ్యవస్థాపకుడు హర్ష మారివాలా. మార్కెట్‌ ట్రెండ్‌ను గుర్తించేందుకు ఇదే సులువైన మార్గం అన్నారు.

Published : 06 Jul 2024 23:24 IST

Harsh Mariwala | ఇంటర్నెట్‌డెస్క్‌: వ్యాపార రంగంలో రాణించాలంటే ఎప్పటికప్పుడు ట్రెండ్‌లు తెలుసుకుంటూ వినియోగదారుల అభిరుచులకు తగ్గట్లు ఉత్పత్తులను తీసుకొస్తుండాలి. దీని కోసం కంపెనీ అధిపతులు, వ్యవస్థాపకులు ఎంతగానో చర్చిస్తారు. ఎప్పటికప్పుడు కస్టమర్ల పల్స్‌ను తెలుసుకొనే ప్రయత్నం చేస్తుంటారు. ఇలా కాకుండా స్వయంగా కస్టమర్ల దగ్గరికే వెళ్లి తమ ఉత్పత్తులు, మార్కెట్‌ ట్రెండ్‌ గురించి తెలుసుకొనే ప్రయత్నం చేశారు ఓ బిలియనీర్‌. ఇలా కస్టమర్లతో నిత్యం సంభాషిస్తుంటానని చెప్పుకొచ్చారు మారికో వ్యవస్థాపకుడు హర్ష మారివాలా (Harsh Mariwala).

మారివాలా ఇటీవలే ముంబయిలోని ఓ దుకాణాన్ని సందర్శించారు. సాధారణ వ్యక్తిలా వెళ్లి అక్కడున్న కొనుగోలుదారులు, పంపిణీదారులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. తాను క్రమం తప్పకుండా స్టోర్‌లను సందర్శిస్తుంటానని ‘ఎక్స్‌’ వేదికగా పంచుకున్నారు. ‘కస్టమర్లు, డిస్ట్రిబ్యూటర్లను తరచూ కలుస్తుంటా. మార్కెట్‌ ట్రెండ్‌, కస్టమర్ల అభిరుచి తెలుసుకొనేందుకు అవగాహన వస్తుంది’ అని చెప్పుకొచ్చారు. సంబంధిత ఫొటోను పంచుకున్నారు. అంతే ఆ పోస్ట్‌ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.

జులై 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. 23న కేంద్ర బడ్జెట్‌

73 సంవత్సరాల వయసులో మార్కెట్‌కు వెళ్లి కస్టమర్లతో మమేకం కావడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘వ్యక్తిగత సంభాషణ వెలకట్టలేనిది, మీరే మాకు స్ఫూర్తి’ అని ఓ యూజర్‌ కామెంట్‌ చేశాడు. ‘వినియోగదారులను అర్థం చేసుకోవాలంటే ప్రత్యక్షంగా కలవడమే ఏకైక మార్గం. తద్వారా ఉత్పత్తుల నాణ్యత, ప్యాకింగ్, సేవల గురించి పూర్తిస్థాయిలో తెలుసుకోవచ్చు’ అని మరో నెటిజన్‌ అన్నాడు. ఇదిలా ఉండగా.. ప్రముఖ ఎఫ్‌ఎమ్‌సీజీ సంస్థ అయిన మారికో సఫోలా వంట నూనె, పారాచూట్‌ హెయిర్‌ ఆయిల్‌ వంటి ప్రధాన ఉత్పత్తులను అందిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని