Bisleri drinks: బిస్లరీ నుంచి 3 కొత్త ఫ్లేవర్లలో సాఫ్ట్ డ్రింక్స్
Bisleri drinks: బిస్లరీ సంస్థ మూడు కొత్త సాఫ్ట్ డ్రింక్స్‌ను తీసుకొచ్చింది. కోలా, ఆరెంజ్, జీరా ఫ్లేవర్లలో వీటిని లాంచ్ చేసింది.
దిల్లీ: బిస్లరీ పేరిట ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ విక్రయించే బిస్లరీ ఇంటర్నేషనల్ సంస్థ (Bisleri International) కొత్తగా మూడు ఫ్లేవర్లలో సాఫ్ట్ డ్రింక్స్‌ను తీసుకొచ్చింది. ఆరెంజ్ ఫ్లేవర్‌లో ‘బిస్లరీ పాప్’, కోలా ఫ్లేవర్‌లో ‘బిస్లరీ రేవ్’తో పాటు పాటు బిస్లరీ స్పైసీ జీరా ఫ్లేవర్లను మంగళవారం లాంచ్ చేసింది. జనరేషన్ జెడ్ లక్ష్యంగా ఈ ఉత్పత్తులను తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకెళ్లేందుకు డిజిటల్, సోషల్ మీడియా మాధ్యమాలతో పాటు రిటైల్, జనరల్ స్టోర్లను వినియోగించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది.
భారత మార్కెట్లో ఐకానిక్ ఉత్పత్తులను తీసుకొచ్చిన చరిత్ర బిస్లరీకి ఉందని, దాన్ని కొనసాగించేందుకు కొత్త ఫ్లేవర్లలో కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్‌ను తీసుకొచ్చినట్లు బిస్లరీ ఇంటర్నేషనల్ వైస్ ఛైర్‌పర్సన్ జయంతి చౌహాన్ తెలిపారు. యువతను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఆకట్టుకుంటున్న వేళ వారిని ఆకర్షించడానికి ఓటీటీ వేదికలపై ఆకట్టుకుంటున్న నటుల చేత ప్రచారం చేయిస్తున్నట్లు తెలిపారు. కొత్త రుచులను ఆస్వాదించడానికి ఎదురుచూసే యువత తమ ఉత్పత్తులను తప్పక ఆదరిస్తారని ఆశిస్తున్నామన్నారు. బిస్లరీ పాప్‌ను నటి, మ్యుజిషియన్ సభా ఆజాద్, నటుడు అర్మన్ రల్హన్ ప్రచారం చేయనున్నారు. ఓటీటీ నటుడు ఆషిమ్ గులాటి కోలా ఫ్లేవర్‌కు, మరో ఓటీటీ నటి అంజలి శివరామన్ స్పైసీ జీరాకు ప్రచారం నిర్వహించనున్నారు. 160ml, 600ml బాటిళ్లలో ఈ డ్రింక్స్ లభ్యం కానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Liquor policy: ఏపీలో మద్యం విధానం ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ
-
Congress: తెలంగాణలో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం: కాంగ్రెస్
-
Vijay Antony: బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా: విజయ్ ఆంటోనీ
-
Akasa Air: సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు..! విమానం ‘ఎమర్జెన్సీ ల్యాండింగ్’
-
Master Peace: నిత్యా మేనన్ ‘మాస్టర్‌పీస్’ విడుదల అప్పుడే.. ట్రైలర్ చూశారా!