ఒక్క ఎస్ఎంఎస్ తో మీ కార్డును బ్లాక్ చేయవచ్చు..

మీరు మీ ఎస్బీఐ ఏటీఎం-కమ్-డెబిట్ కార్డును పోగొట్టుకోవడం లేదా ఎక్కడైనా పెట్టి మర్చిపోవడం చేశారా? ఒకవేళ మీరు అలా చేసినట్లయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫ్రాడ్ లేదా అనధికార లావాదేవీలను నివారించడానికి మీరు చేయాల్సిందల్లా మీ ఎస్బీఐ ఏటీఎం కార్డును బ్లాక్ చేయడమే. కార్డును బ్లాక్ చేయడానికి మీరు...

Updated : 01 Jan 2021 19:48 IST

మీరు మీ ఎస్బీఐ ఏటీఎం-కమ్-డెబిట్ కార్డును పోగొట్టుకోవడం లేదా ఎక్కడైనా పెట్టి మర్చిపోవడం చేశారా? ఒకవేళ మీరు అలా చేసినట్లయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫ్రాడ్ లేదా అనధికార లావాదేవీలను నివారించడానికి మీరు చేయాల్సిందల్లా మీ ఎస్బీఐ ఏటీఎం కార్డును బ్లాక్ చేయడమే. కార్డును బ్లాక్ చేయడానికి మీరు బ్యాంకు కస్టమర్ కేర్ ని సంప్రదించవచ్చు. అలాగే మీరు ఆన్‌లైన్‌లో లాగిన్ అవ్వడం ద్వారా లేదా ఎస్బీఐ మొబైల్ యాప్ ద్వారా కూడా కార్డును బ్లాక్ చేయవచ్చు. ఇవి కాకుండా మీరు కోల్పోయిన ఎస్బీఐ ఏటీఎం-కమ్-డెబిట్ కార్డును బ్లాక్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేని సులువైన మరొక మార్గం కూడా ఉంది. మీరు పోగొట్టుకున్న ఎస్బీఐ కార్డును బ్లాక్ చేయడానికి మీ మొబైల్ నెంబర్ నుంచి కేవలం ఒక మెసేజ్ పంపిస్తే సరిపోతుంది.

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐ, తన ఎస్బీఐ క్విక్ యాప్ ద్వారా టోల్ ఫ్రీ ఎస్ఎంఎస్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఎస్బీఐ క్విక్ యాప్ తో ఎస్ఎంఎస్ పంపడం ద్వారా లేదా మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా సర్వీసులను అభ్యర్థించవచ్చు. కేవలం వారి ఏటీఎం కార్డులను బ్లాక్ చేయడమే కాకుండా పీఓఎస్, ఏటీఎంల వద్ద ఏటీఎం కార్డ్ ను స్విచ్ ఆన్ / ఆఫ్ చేయడం వంటివి కూడా చేయవచ్చు. అలాగే ఎస్బీఐ వినియోగదారులు వారి బ్యాంకు అకౌంట్ బ్యాలెన్స్, మినీ స్టేట్మెంట్, చెక్ బుక్ అభ్యర్థన, గత ఆరు నెలల ఖాతా స్టేట్మెంట్, గృహ రుణం వంటి వాటిని ఈ యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

ఎస్ఎంఎస్ ద్వారా ఎస్బీఐ ఏటీఎం-కమ్-డెబిట్ కార్డును ఎలా బ్లాక్ చేయాలి?

మీరు ఎస్బీఐ ఏటీఎం-కమ్-డెబిట్ కార్డును ఆఫ్‌లైన్‌ ద్వారా కూడా బ్లాక్ చేయవచ్చు. కానీ దాని కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, మీ ఏటీఎం కార్డు చివరి 4 నంబర్లు అవసరం.

“BLOCK XXXX” అని టైపే చేసి 567676 నెంబర్ కు ఎస్ఎంఎస్ పంపండి. ఇక్కడ XXXX అంటే మీ ఎస్బీఐ ఏటీఎం-కమ్-డెబిట్ కార్డు చివరి నాలుగు అంకెలు. మీ అభ్యర్థనను అంగీకరించిన తరువాత టికెట్ నెంబర్, బ్లాక్ చేసిన తేదీ, సమయాన్ని తెలిపే ఎస్ఎంఎస్ మీ మొబైల్ నెంబర్ కు వస్తుంది.

పైన పేర్కొన్న ఏదైనా సర్వీసులను ఉపయోగించుకోవటానికి, మీ మొబైల్ నంబర్ ను బ్యాంకులో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీరు సర్వీసులను ఉపయోగించుకోవచ్చు. మీరు ఇప్పటికే మీ మొబైల్ నంబర్‌ను బ్యాంకులో నమోదు చేసుకుంటే, మీరు పైన తెలిపిన విధంగా కార్డును బ్లాక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బ్యాంకులో ఫోన్ నంబర్ ను నమోదు చేయకపోతే, కింద తెలిపిన విధంగా మీ మొబైల్ నుంచి ఎస్ఎంఎస్ ను పంపడం ద్వారా నమోదు చేసుకోవచ్చు.

ఎస్ఎంఎస్ పంపించాల్సిన విధానం - REG మీ ఖాతా నెంబర్ ను టైపు చేసి 09223488888 నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపండి. ఇది మీ ఫోన్ నంబర్‌ను బ్యాంకులో సులభంగా నమోదు చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని