బీఎండబ్ల్యూ జాయ్‌ డేస్‌.. కార్లపై డీల్స్‌ (ప్రకటన)

జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త ఆఫర్లను ప్రకటించింది. ‘బీఎండబ్ల్యూ జాయ్‌ డేస్‌’ పేరిట వాహనాలు, యాక్సెరీస్‌, ఆఫ్టర్‌ సేల్‌, సర్వీసెస్‌పై ప్రయోజనాలను............

Updated : 15 Mar 2021 20:00 IST

జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త ఆఫర్లను ప్రకటించింది. ‘బీఎండబ్ల్యూ జాయ్‌ డేస్‌’ పేరిట వాహనాలు, యాక్సెరీస్‌, ఆఫ్టర్‌ సేల్‌, సర్వీసెస్‌పై ప్రయోజనాలను అందిస్తోంది. స్వల్పకాలానికి ప్రకటించిన ఈ ఆఫర్‌ 2021 మార్చి 31తో ముగియనుంది. తమకు వినియోగదారుల ప్రయోజనాలే పరమావధి అని చెప్పడానికి ఈ ఆఫర్లే ఉదాహరణ అని కంపెనీ తెలిపింది. 2007 నుంచి దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించిన బీఎండబ్ల్యూ.. ఎప్పటికప్పుడు ఆఫర్లను ప్రకటిస్తూ వస్తోంది. తాజాగా ‘జాయ్‌ డేస్‌’తో ముందుకొచ్చింది.

జాయ్‌ డేస్‌ కింద కొన్ని ప్రయోజనాలను బీఎండబ్ల్యూ ప్రకటించింది. 4.99 శాతం నుంచి ప్రారంభయ్యే వడ్డీ రేట్లు, జీరో డౌన్‌ పేమెంట్‌, బీఎండబ్ల్యూ కార్ల కొనుగోలుపై 5 లక్షల వరకు తరుగుదల, అదనపు ప్రయోజనాలను ఇస్తోంది. అలాగే బీఎండబ్ల్యూ యాక్సెసరీస్‌పై 50 శాతం వరకు రాయితీ వంటి సదుపాయాలు కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌ స్వల్పకాలికమేనని, మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని బీఎండబ్ల్యూ డీలర్లను సంప్రదించాలని కంపెనీ సూచించింది.

వివిధ మోడళ్లపై ఉన్న డీల్స్‌ ఇవీ...


బీఎండబ్ల్యూ 5 సిరీస్‌

బీఎండబ్ల్యూ 5 సిరీస్‌లో 530i స్పోర్ట్స్‌ వేరియంట్‌ ధర రూ.56 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని 530d M స్పోర్ట్‌ వేరియంట్‌ ధర గరిష్ఠంగా రూ.69.1 లక్షల వరకూ ఉంది.

* జీరో డౌన్‌పేమెంట్‌ సదుపాయం

* వడ్డీ రేటు 4.99 శాతం నుంచి మొదలు
* కాంప్లిమెంటరీ సర్వీస్‌ ప్లాన్‌ మూడేళ్లు /40వేల కి.మీ.
* రూ.4.41 లక్షల వరకు తరుగుదల, అదనపు ప్రయోజనాలు


బీఎండబ్ల్యూ X3

బీఎండబ్ల్యూ ఎక్స్‌డ్రైవ్‌30i స్పోర్ట్స్‌ఎక్స్‌ వేరియంట్‌ ధర రూ.56.5 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఎక్స్‌డ్రైవ్‌20d లగ్జరీ లైన్‌ ధర గరిష్ఠంగా రూ.62.5 లక్షల వరకూ ఉంది.
* జీరో డౌన్‌పేమెంట్‌ సదుపాయం
* వడ్డీ రేటు 6.25 శాతం నుంచి ప్రారంభం
* కాంప్లిమెంటరీ సర్వీస్‌ ప్లాన్‌ మూడేళ్లు/ 40వేల కి.మీ.


బీఎండబ్ల్యూ X‌1

ఎస్‌డ్రైవ్‌ 20i స్పోర్ట్స్‌ ఎక్స్‌ వేరియంట్‌ రూ.37.2 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఎస్‌డ్రైవ్‌ 20d ఎం స్పోర్ట్‌ మోడల్‌ వేరియంట్‌ గరిష్ఠంగా రూ.42.9 లక్షలు పలుకుతోంది.
* నెలవారీ చెల్లింపుల సదుపాయం రూ.39,999 నుంచి ప్రారంభం
* బైబ్యాక్‌ పై 42 శాతం కచ్చితమైన హామీ
* తరుగుదల, అదనపు ప్రయోజనాలు రూ.2.95 లక్షల వరకు లభిస్తాయి.


బీఎండబ్ల్యూ 2 సిరీస్‌ గ్రాన్‌ కూప్‌

220d స్పోర్ట్‌లైన్‌ వేరియంట్‌ ధర రూ.40.4 లక్షల నుంచి ప్రారంభం కానుంది. 220d ఎం స్పోర్ట్‌ గరిష్ఠ ధర రూ.42.3 లక్షలుగా ఉంది.
* నెలవారీ చెల్లింపుల సదుపాయం రూ.39,300 నుంచి ప్రారంభం
* తరుగుదల ప్రయోజనాలు, ప్రత్యేక ప్రయోజనాలు రూ.2.5 లక్షల వరకు లభిస్తాయి.


బీఎండబ్ల్యూ 3 సిరీస్‌ గ్రాన్‌ లిమోసిన్‌

330Li లగ్జరీ లైన్‌ వేరియంట్‌ రూ.51.5 లక్షల నుంచి ప్రారంభం కానుంది. 330Li ఎం స్పోర్ట్‌ ఫస్ట్‌ ఎడిషన్‌ ధర గరిష్ఠంగా 53.9 లక్షలుగా ఉంది.
* నెలవారీ చెల్లింపులు రూ.59,999 నుంచి ప్రారంభం
* తరుగుదల ప్రయోజనాలు, ప్రత్యేక ప్రయోజనాలు రూ.3.24 లక్షల వరకు లభిస్తాయి.


బీఎండబ్ల్యూ 3 సిరీస్‌

330i స్పోర్ట్‌ వేరియంట్‌ ధర రూ.42.6 లక్షల నుంచి ప్రారంభం కానుంది. 330i ఎం స్పోర్ట్‌ వేరియంట్‌ గరిష్ఠంగా రూ.49.9 లక్షలకు లభించనుంది. 
* నెలవారీ చెల్లింపుల సదుపాయం రూ.49,999 నుంచి ప్రారంభం
* తరుగుదల ప్రయోజనాలు, ప్రత్యేక ప్రయోజనాలు రూ.3.15 లక్షల వరకు లభిస్తాయి.


బీఎండబ్ల్యూ 6జీటీ

ఇందులోని 630i లగ్జరీ లైన్‌ వేరియంట్‌ రూ.65.9 లక్షల నుంచి ప్రారంభం కానుండగా 630d ఎం స్పోర్ట్‌ వేరియంట్‌ గరిష్ఠ ధర రూ.77 లక్షల వరకూ ఉంది.
* జీరో పేమెంట్‌ సదుపాయం
* వడ్డీరేటు 4.99 శాతం నుంచి ప్రారంభం
* కాంప్లిమెంటరీ సర్వీసు ప్లాన్‌ మూడేళ్లు/ 40వేల కి.మీ.
* తరుగుదల, ప్రత్యేక ప్రయోజనాలు రూ.3.49 లక్షల వరకు లభిస్తాయి.


బీఎండబ్ల్యూ ఎక్స్‌4

ఎక్స్‌ డ్రైవ్‌20d ఎం స్పోర్ట్‌ ఎక్స్‌ వేరియంట్‌ ధర రూ.62.4 లక్షల నుంచి ప్రారంభం అవుతుండగా.. ఎక్స్‌ డ్రైవ్‌ 30d ఎం స్పోర్ట్‌ ఎక్స్‌ వేరియంట్‌ గరిష్ఠ ధర రూ.68.9 లక్షలుగా ఉంది.
* జీరో డౌన్‌ పేమెంట్‌
* వడ్డీ రేటు 5.55 శాతం నుంచి ప్రారంభం
* కాంప్లిమెంటరీ సర్వీస్‌ ప్లాన్‌ మూడేళ్లు/ 40వేల కి.మీ.
* తరుగుదల, ప్రత్యేక అదనపు ప్రయోజనాలు రూ.4.49 లక్షల వరకు లభిస్తాయి.

(*పైన పేర్కొన్నవన్నీ ఎక్స్‌ షోరూమ్‌ ధరలు)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని