బీఎండబ్ల్యూ F900 XR విడుదల.. టాప్‌స్పీడ్‌ 200 km/hr

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ భారత మార్కెట్లో నవీకరించిన F 900 XR బైక్‌ను విడుదల చేసింది. దీని ధరను రూ.12.3 లక్షలుగా నిర్ణయించింది.

Published : 14 Apr 2022 20:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ భారత మార్కెట్లో నవీకరించిన F900 XR బైక్‌ను విడుదల చేసింది. దీని ధరను రూ.12.3 లక్షలుగా నిర్ణయించింది. కంప్లీట్లీ బిల్ట్‌ అప్‌ యూనిట్‌ (సీబీయూ)లను దిగుమతి చేసి భారత మార్కెట్లో విక్రయించనున్నారు. ద్విచక్ర వాహన విభాగం బీఎండబ్ల్యూ మోటోరాడ్‌ డీలర్‌షిప్‌ల వద్ద ఈ బైక్‌ను బుక్‌ చేసుకోవచ్చు. జూన్‌ నుంచి వాహనాలను అందజేస్తామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

కొత్త F900 XR బైక్‌లో 895 సీసీ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 105 hpని ఉత్పత్తి చేస్తుంది. కేవలం 3.6 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ఠంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. ఇందులో 6.5 అంగుళా ఫుల్‌ కలర్‌ టీఎఫ్‌టీ మల్టీ ఫంక్షనల్‌ స్క్రీన్‌ ఉంటుంది. ఎలాంటి యాప్‌ అవసరం లేకుండానే వాహనదారులు తమ మొబైల్‌ను కనెక్ట్‌ చేసుకోవచ్చు. ప్రపంచంలోని అత్యుత్తమ పనితీరు కనబరిచే ప్రీమియం మోటార్‌ సైకిల్‌ను బీఎండబ్ల్యూ మోటోరాడ్‌ భారత్‌కు తీసుకొచ్చిందని, మోటార్‌సైకిల్‌ ప్రియుల్లో ఎక్స్‌ఆర్‌ తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుందని బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా ప్రెసిడెంట్‌ విక్రమ్‌ పవాహ్‌ తెలిపారు. నవీకరించిన ఎక్స్‌ఆర్‌ మరింత రైడింగ్‌ అనుభూతిని అందిస్తుందని విడుదల సందర్భంగా పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని