Credit Card: రూ.20 లక్షల బీమా కవరేజీతో విక్రమ్‌ క్రెడిట్‌ కార్డు..వారికి మాత్రమే..!

Vikram Credit Card: భారత రక్షణ, పారామిలిటరీ, పోలీసు సిబ్బంది కోసం బీఎఫ్‌ఎస్‌ఎల్‌ విక్రమ్‌ పేరుతో కొత్త క్రెడిట్‌ కార్డును తీసుకొచ్చింది.

Published : 24 Jan 2023 16:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అనుబంధ సంస్థ ‘బీఓబీ ఫైనాన్షియల్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ (BFSL) భారత రక్షణ, పారామిలిటరీ, పోలీసు సిబ్బంది కోసం విక్రమ్‌ పేరుతో కొత్త క్రెడిట్‌ కార్డు (Vikram Credit Card)ను విడుదల చేసింది. 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మన దేశ సైనికుల కోసం విక్రమ్‌ క్రెడిట్‌ కార్డు (Vikram Credit Card)ను తీసుకొచ్చినట్లు బీఎఫ్‌ఎస్‌ఎల్‌ తెలిపింది.  

విక్రమ్‌ క్రెడిట్‌ కార్డు ఫీచర్లు..

  • జీవిత కాల ఉచిత (Life time free) క్రెడిట్‌ కార్డు
  • ఆకర్షణీయమైన రివార్డు పాయింట్లు, కాంప్లిమెంటరీ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌
  • రూ.20 లక్షల ప్రమాద బీమా
  • ఎల్‌టీఎఫ్‌ యాడ్‌-ఆన్‌లు
  • 1% ఇంధన సర్‌ఛార్జ్‌ మినహాయింపు
  • ఈఎంఐ ఆఫర్లు
  • కాలానుగుణ మర్చెంట్‌ ఆఫర్లు

బీఎఫ్‌ఎస్‌ఎల్‌ ఇప్పటికే ఇండియన్‌ ఆర్మీ కోసం ‘యోధ’, ఇండియన్‌ నేవీ కోసం ‘వరుణ’, ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ కోసం ‘రక్షమా’, అస్సాం రైఫిల్స్‌ కోసం ‘ది సెంటినెల్‌’ వంటి ప్రత్యేకమైన కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డుల (Credit Card)ను అందిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని