chanda kochhar: చందా కొచ్చర్‌కు బెయిల్ వచ్చేనా?
ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందాకొచ్చర్ బెయిల్ బిటిషన్పై తీర్పును బొంబాయి హైకోర్టు వాయిదా వేసింది.
ముంబయి: ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్ (Chanda Kochhar), ఆమె భర్త దీపక్ కొచ్చర్ (Deepak Kochhar) మధ్యంతర బెయిల్ పిటిషన్లపై తీర్పును బాంబే హైకోర్టు (bombay HighCourt) వాయిదా చేసింది. వీడియోకాన్ (Videocon) గ్రూప్‌నకు రుణాలు మంజూరు వ్యవహారంలో గత డిసెంబరు 23న సీబీఐ వారిద్దరినీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తమను అక్రమంగా అరెస్టు చేశారని, మరోవైపు తమ కుమారుడి వివాహం నిశ్చయమైందని, ఇప్పటికే బంధువులందరికీ ఆహ్వానాలు పంపిన నేపథ్యంలో కార్యక్రమం రద్దు చేయడం సరికాదంటూ తమకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కొచ్చర్ దంపతులు బాంబే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై ఇవాళ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున అడ్వకేట్ అమిత్ దేశాయ్ వాదనలు వినిపించారు. అరెస్టుకు ముందే నవంబరు 1న చందాకొచ్చర్ వ్యక్తిగతంగా సీబీఐకి లేఖ రాశారని, స్వయంగా తానే వచ్చి కావాల్సిన వివరాలు తెలియపరుస్తానని చెప్పినట్లు కోర్టుకు వివరించారు. వారం గడిచినా సీబీఐ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని, ఆ తర్వాత కొచ్చర్ దంపతులను సీబీఐ అధికారులు అరెస్టు చేశారని కోర్టుకు వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. దీనిపై స్పందన తెలియజేయాల్సిందిగా సీబీఐని ఆదేశించింది.
ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.3,250 కోట్ల రుణాన్ని వీడియోకాన్ గ్రూపు పొందిన తర్వాత.. అందులో కోట్లాది రూపాయలను దీపక్ కొచ్చర్ నిర్వహించే న్యూపవర్‌లో, వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్ పెట్టుబడులుగా పెట్టినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఈ కేసులో చందా కొచ్చర్ దంపతులు మోసం, అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ అభియోగాలు మోపింది. ఐపీసీ, మనీ లాండరింగ్ నియంత్రణ చట్టం నిబంధనల కింద చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్తో పాటు వీడియోకాన్ గ్రూపునకు చెందిన వేణుగోపాల్ ధూత్, న్యూపవర్ రెన్యూవబుల్స్, సుప్రీమ్ ఎనర్జీ, వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్, వీడియోకాన్ ఇండస్ట్రీస్‌లపై ఎఫ్ఐఆర్ను సీబీఐ నమోదు చేసింది. ప్రస్తుతం ఈ ముగ్గురూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
Retail Brands: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాల ద్వారా దేశంలో ఆధ్యాత్మిక పర్యటకం అభివృద్ధి చెందుతోంది. దీంతో రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. -
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్‌కు వాటా
అంబానీ, అదానీ తొలిసారి చేతులు కలిపారు. ఓ పవర్ ప్రాజెక్ట్ విషయంలో వీరి మధ్య భాగస్వామ్యం కుదిరింది. -
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
యాక్సిస్ బ్యాంకు కస్టమర్లు కొందరు తమ క్రెడిట్ కార్డుల్లో అనధికారిక లావాదేవీలు జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. దీనిపై బ్యాంక్ స్పందించింది. -
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. సోషల్‌మీడియా వేదిక ‘ఎక్స్’లో ప్రీమియం, ప్రీమియం ప్లస్ సబ్స్క్రిప్షన్లు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. -
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 655 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్‌లైన్!
March 31 deadline: మ్యూచువల్ ఫండ్లలో మదుపు ప్రారంభించినప్పుడు విద్యుత్, గ్యాస్ బిల్లులు, బ్యాంకు ఖాతాలు సమర్పించి కేవైసీ నిబంధనలు పూర్తి చేసిన వారు.. మరోసారి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. -
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 300 పాయింట్ల లాభంలో ట్రేడవుతున్నాయి. -
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్‌బర్గ్ గాలం?
Mark Zuckerberg: మార్కెట్లో ఏఐ నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. ఆ స్థాయిలో ప్రొఫెషనల్స్ అందుబాటులో లేరు. దీంతో ఇతర కంపెనీల్లోని వారిని ఆకర్షించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మెటా సైతం ఇదే బాటలో పయనిస్తున్నట్లు సమాచారం. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడి 73,191 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 22,186 దగ్గర కొనసాగుతోంది. -
ఈ 25 షేర్లు కొన్న రోజే ఖాతాలోకి వచ్చేస్తాయ్
ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్ రోజున జరుగుతోంది. -
మన బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు
గత 10 ఏళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. -
రిలయన్స్.. బ్యాంకింగ్ షేర్లు రాణించాయ్
దేశీయ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఇతర చమురు సంస్థల షేర్లు దూసుకెళ్లడం, బ్యాంకింగ్, వాహన షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటం, సానుకూల స్థూల గణాంకాలతో సెన్సెక్స్ 526 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి. -
పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్!
బజాజ్ ఫైనాన్స్‌లో ఓ విభాగంగా ఉన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్.. తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
కూకట్‌పల్లిలో 264 ఎకరాలు రూ.3402 కోట్లు!
హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఉన్న 264.50 ఎకరాల భూమిని రూ.3402 కోట్లకు విక్రయించనున్నట్లు హిందూజా గ్రూప్ సంస్థ జీఓసీఎల్ కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది. -
జీడీపీలో 2% వెచ్చిస్తే 1.1 కోట్ల ఉద్యోగాల సృష్టి
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 2 శాతాన్ని నేరుగా ప్రజా సంరక్షణ సేవలపై వెచ్చించడం వల్ల 1.1 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, ఈ ఉద్యోగాల్లో 70% వరకు మహిళలకే లభిస్తాయని ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) రూపొందించిన ఓ నివేదిక వెల్లడించింది. -
హైదరాబాద్ ఇళ్ల విక్రయాల్లో 38% వృద్ధి
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున 14% వృద్ధి చెందాయని, సగటు ధరలూ 10-32% పెరిగినట్లు స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ తాజా నివేదికలో తెలిపింది. -
బాండ్ల ద్వారా రూ.7.5 లక్షల కోట్ల సమీకరణకు నిర్ణయం
2024-25 ఏప్రిల్-సెప్టెంబరులో మార్కెట్ ద్వారా రూ.7.5 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. -
సనోఫి టీకాలను పంపిణీ చేయనున్న డాక్టర్ రెడ్డీస్
సనోఫి హెల్త్‌కేర్ ఇండియా టీకాలను మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ పంపిణీ చేయనుంది. -
సంక్షిప్త వార్తలు(6)
జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా పనిచేసే డ్యూయిష్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో హైదరాబాద్‌కు చెందిన సైయెంట్ లిమిటెడ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం