Credit cards Movie tickets: మీరు సినీ ప్రేమికులా?ఈ క్రెడిట్ కార్డులపై ఓ లుక్కేయండి!
సినీ ప్రేమికుల కోసం కొన్ని బ్యాంకులు ప్రత్యేకంగా క్రెడిట్ కార్డులు అందజేస్తున్నాయి.. అవేంటో చూద్దాం...
ఇంటర్నెట్ డెస్క్: కొవిడ్ మహమ్మారి కారణంగా దాదాపు రెండేళ్ల పాటు అభిమానులు థియేటర్ల (Theatre)కు దూరమయ్యారు. క్రమంగా మహమ్మారి ముప్పు తొలగిపోయి సినిమా హాళ్లు తెరుచుకుంటుండడంతో ఇప్పుడు జనం సినిమాలు చూడడానికి పోటెత్తుతున్నారు. ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్-2లకు దక్కిన భారీ విజయమే అందుకు నిదర్శనం. మరి మీరు కూడా సినీ ప్రేమికులా? తరచూ థియేటర్ల (Theatre)కు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారా? అలాంటి వారి కోసం కొన్ని బ్యాంకులు ప్రత్యేకమైన క్రెడిట్ కార్డులు (Credit Card) అందజేస్తున్నాయి. వీటితో క్యాష్‌బ్యాక్, ఉచితంగా టికెట్లు (Free Movie Tickets), రాయితీల వంటి ప్రత్యేక ఆఫర్లను పొందొచ్చు. మరి ఆ కార్డులేంటో చూసేద్దామా..!
కొటాక్ డిలైట్ ప్లాటినం క్రెడిట్ కార్డు
ఒకనెలలో రూ.10,000కు మించి ఖర్చు చేస్తే (డైనింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలను మినహాయించి) సినిమా టికెట్లపై 10 శాతం క్యాష్‌బ్యాక్ (Cashback) వస్తుంది. ఒక సంవత్సరంలో ఖర్చులు రూ.1.25 లక్షలు దాటితే.. నాలుగు ఉచిత పీవీఆర్ (PVR) టికెట్లు లేదా రూ.750 క్యాష్‌బ్యాక్ అందిస్తారు. వార్షిక ఫీజు రూ.299.
యాక్సిస్ మై జోన్ క్రెడిట్ కార్డు
పేటీఎం మూవీస్ ద్వారా రెండో సినిమా టికెట్ (Movie Tickets) కొనుగోలు చేస్తే 100 శాతం రాయితీ లభిస్తుంది. అర్హతగల వారికి సోనీలివ్ వార్షిక సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తున్నారు. అలాగే అజియో (Ajio)లో కనీసం రూ.2,000 ఖర్చు చేస్తే రూ.600 తగ్గింపు లభిస్తుంది. భాగస్వామ్య రెస్టారెంట్లలో 20 శాతం రాయితీ కూడా ఉంది. ఈ కార్డుపై తొలి ఏడాది ఎలాంటి వార్షిక రుసుము ఉండదు. రెండో ఏడాది నుంచి రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
పీవీఆర్ కొటాక్ ప్లాటినం క్రెడిట్ కార్డు
ఒకనెలలో రూ.10,000 ఖర్చు చేస్తే రెండు పీవీఆర్ టికెట్లు ఉచితంగా లభిస్తాయి. పీవీఆర్ బాక్సాఫీస్ వద్ద సినిమా టికెట్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తారు. అలాగే పీవీఆర్‌లో ఫుడ్, బివరేజెస్‌పై 15 శాతం రాయితీ లభిస్తుంది. వార్షిక రుసుము రూ.999.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్లాటినం టైమ్స్ క్రెడిట్ కార్డు
బుక్‌మైషో (BookMyShow) ద్వారా సినిమా టికెట్లు బుక్ చేసుకుంటే 25 శాతం రాయితీ లభిస్తుంది. వారాంతాల్లో డైనింగ్‌పై చేసే ప్రతి రూ.150 ఖర్చుపై 10 రివార్డు పాయింట్లు దక్కుతాయి. ఇతర కేటగిరీల్లో మూడు రివార్డు పాయింట్లను అందజేస్తారు. వార్షిక రుసుము రూ.1000. ఒకవేళ ఒక సంవత్సరంలో చేసే ఖర్చు రూ.2.5 లక్షలు దాటితే.. వార్షిక రుసుమును రద్దు చేస్తారు.
ఎస్‌బీఐ ఎలైట్ కార్డు
ఏటా రూ.6,000 విలువ చేసే సినిమా టికెట్లను ఉచితంగా పొందొచ్చు. ఒక నెలలో రెండు టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో టికెట్‌పై గరిష్ఠంగా రూ.250 రాయితీ లభిస్తుంది. ఈ రాయితీ రెండు టికెట్లకు మాత్రమే వర్తిస్తుంది. డైనింగ్, డిపార్ట్‌మెంటల్ స్టోర్లు, గ్రోసరీలపై చేసే ఖర్చుకు ప్రత్యేకంగా రివార్డు పాయింట్లు లభిస్తాయి. అదనంగా ఏటా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఆరు లాంజ్ యాక్సెస్‌లు కూడా ఉంటాయి. దీని వార్షిక రుసుము రూ.4,999
క్రెడిట్ కార్డు వినియోగం విషయంలో క్రమశిక్షణగా ఉండాలి. వడ్డీరహిత రుణం గనక ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంది. సినిమా టికెట్లు, ఫుడ్, బివరేజీలు, డైనింగ్, రెస్టారెంట్లలో అతిగా ఖర్చు చేయకుండా జాగ్రత్త పడాలి. ఖర్చులు.. భరించలేని స్థాయికి వెళితే ప్రమాదమే. క్రెడిట్ కార్డుపై 28-49 శాతం వడ్డీరేటు ఉంటుందన్న విషయం మర్చిపోవద్దు. పైగా ఆలస్య రుసుము కూడా చెల్లించాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Leander Paes: టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు అరుదైన గుర్తింపు
-
Babar Azam: టాప్-4 చిన్న విషయం.. ప్రపంచకప్ గెలవడమే మా లక్ష్యం : బాబర్ అజామ్
-
Guntur Kaaram: రాజమౌళి చిత్రాల స్థాయిలో ‘గుంటూరు కారం’.. ఆ మాటకు కట్టుబడి ఉన్నా: నిర్మాత నాగవంశీ
-
JP Nadda : జేపీ నడ్డా పూజలు చేస్తున్న గణేశ్ మండపంలో అగ్నిప్రమాదం
-
Priyamani: ప్రియమణి విషయంలో మరో రూమర్.. స్టార్ హీరోకి తల్లిగా!
-
Sharad Pawar: ‘ఇండియా’లోకి అన్నాడీఎంకేను తీసుకొస్తారా..? శరద్‌పవార్ ఏమన్నారంటే..