Bounce on Flipkart: ఇ-కామర్స్‌ వేదికగా తొలిసారి.. ఫ్లిప్‌కార్ట్‌లో బౌన్స్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు

Bounce on Flipkart: ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీ సంస్థ బౌన్స్‌ తన ఇన్ఫినిటీ బ్రాండ్‌ స్కూటర్లను ఇకపై ఇ-కామర్స్‌ వేదిక ఫ్లిప్‌కార్ట్‌ వేదికగా విక్రయాలు మొదలు పెట్టింది. 

Published : 22 Jul 2022 22:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీ సంస్థ బౌన్స్‌ తన ఇన్ఫినిటీ బ్రాండ్‌ స్కూటర్లను ఇకపై ఇ-కామర్స్‌ వేదిక ఫ్లిప్‌కార్ట్‌ వేదికగా విక్రయాలు మొదలు పెట్టింది. శుక్రవారం (జులై 22) నుంచి ఈ విక్రయాలు మొదలయ్యాయి. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా బుక్‌ చేసుకున్న 15 రోజుల్లో వినియోగదారులకు వీటిని డెలివరీ చేయనున్నారు. తొలుత దిల్లీ, గుజరాత్‌, కర్ణాటక, మహారాష్ట్రలో ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆన్‌లైన్‌లో స్కూటర్‌ కొనుగోలు చేసినప్పటికీ ఆయా రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్‌ సబ్సిడీ స్కూటర్లకు వర్తించే సబ్సిడీని పొందొచ్చు.

ఎలక్ట్రిక్‌ స్కూటర్లను ఇలా ఇ-కామర్స్‌ వేదికపై విక్రయించడం దేశంలో ఇదే తొలిసారి. బౌన్స్‌ తొలిసారి దీనికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఓలా కంపెనీ ఆన్‌లైన్‌లో ఈ విధంగా విక్రయిస్తున్నప్పటికీ తన సొంత యాప్‌ ద్వారా విక్రయాలు జరుపుతోంది. ఏథర్‌, హీరో ఎలక్ట్రిక్‌ మాత్రం డీలర్‌షిప్‌ల వద్ద విక్రయిస్తున్నాయి. ఎలక్ట్రిక్‌ వాహనాల డెలివరీలో ఇ-కామర్స్‌ సంస్థలు కీలక పాత్ర పోషించనున్నాయని బౌన్స్‌ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు వివేకానంద హళ్ళకెరె ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఫ్లిప్‌కార్ట్‌ వేదికగా బౌన్స్‌ ఇన్ఫినిటీ ఈ1తో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ స్కూటర్‌లో పవర్‌ మోడ్‌, రివర్స్‌ మోడ్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌, డ్రాగ్‌ మోడ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 85 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. ఇది ఐదు రంగుల్లో లభిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని