Prepaid Plan: ₹1000తో డైలీ 3జీబీ డేటా..180 రోజుల వ్యాలిడిటీ..దేంట్లో తెలుసా?

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.1000 లోపే. మరి ఆ ప్రీపెయిడ్‌ ప్యాక్ (Prepaid plans) వివరాలేంటో చూద్దాం....

Updated : 29 Jun 2022 14:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) ప్రీపెయిడ్‌ యూజర్ల కోసం అనేక  ప్లాన్ల (Prepaid plans)ను అందుబాటులో ఉంచింది. వాటిలో నుంచి అత్యంత ప్రయోజనకరంగా ఉండే ప్యాక్‌ను ఎంపిక చేసుకోవడానికి కొంత సమయం వెచ్చించాల్సిందే. మరి దీర్ఘకాల వ్యాలిడిటీ, ఎక్కువ మొత్తంలో డేటా కావాలనుకునేవారికి బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) మంచి ప్లాన్‌ను అందిస్తోంది. అదీ రూ.1000 లోపే. మరి ఆ ప్రీపెయిడ్‌ ప్యాక్ (Prepaid plans) వివరాలేంటో చూద్దాం..

* బీఎస్‌ఎన్‌ఎల్‌లో రోజూ 3జీబీ డేటా ప్యాక్‌ను రూ.997కు అందిస్తోంది. దీని కాలపరిమితి 180 రోజులు. అయితే, దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL)లో ఇంకా 4జీ అందుబాటులో లేకపోవడం కొంత నిరుత్సాహపరిచే విషయం. అయినప్పటికీ.. బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) నెట్‌వర్క్‌ సమస్యలేని ప్రాంతాల్లో ఈ ప్లాన్‌ తీసుకోవడం చాలా ప్రయోజనకరం.

* 3జీబీ రోజువారీ డేటాతో పాటు రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత వాయిస్‌ కాలింగ్ కూడా ఉన్నాయి. 180 రోజుల పాటు లోక్‌ధమ్‌ కంటెంట్‌ కూడా ఉచితం. డేటా వినియోగం పూర్తయిన తర్వాత వేగం 80 కేబీపీఎస్‌కు పడిపోతుంది.

* ప్రస్తుతానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. ఆయా ప్రదేశాల్లో ఈ ప్యాక్‌ యూజర్లకు ఎంతో ప్రయోజనకరం. రూ.1000 లోపు 6 నెలల వ్యాలిడిటీతో, డైలీ 3జీబీ డేటా ఇతర ఏ టెలికాం సంస్థ అందించడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని