- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
BSNL: బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకుంటున్నారా?ఈ BSNL ప్యాక్‌పై లుక్కేయాల్సిందే!
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో టాప్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లలో బీఎస్ఎన్ఎల్ (BSNL) ఒకటి. గత కొన్నేళ్లుగా తనదైన బ్రాడ్‌బ్యాండ్ సేవల (Broadband Services)తో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు దీని నెట్వర్క్ విస్తరించింది. భారత్ ఫైబర్ (Bharat Fibre) ద్వారా ఇప్పుడు ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లోనూ గట్టి పోటీనిస్తోంది. ఒకవేళ బీఎస్ఎన్ఎల్ (BSNL) నుంచే గనక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ (Broadband Services) కొనాలనుకుంటే ఈ ప్యాక్‌పై ఓసారి లుక్కేయండి..!
300 ఎంబీపీఎస్ వేగంతో 4టీబీ డేటా..
- నెల వ్యాలిడిటీతో వస్తున్న ఈ ప్లాన్ ధర రూ.1,499. 300 ఎంబీపీఎస్ వరకు వేగాన్ని ఎంజాయ్ చేయొచ్చు. డౌన్లోడింగ్, అప్లోడింగ్.. రెండింటికీ ఈ స్పీడ్ వర్తిస్తుంది. ప్రతినెలా 4టీబీ డేటా వస్తుంది. ఇతర ప్రైవేట్ సంస్థలేవీ ఈ స్థాయి డేటాను అందించడం లేదు.
- అదనంగా ఈ ప్లాన్‌లో ఏడాది కాలపరిమితితో డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందొచ్చు. వాస్తవానికి ఈ సబ్‌స్క్రిప్షన్‌ను ప్రత్యేకంగా తీసుకుంటే రూ.1,499 చెల్లించాల్సి ఉంటుంది. కానీ, బీఎస్ఎన్ఎల్లో మాత్రం ఈ ప్లాన్ యాక్టివేట్ చేయించుకుంటే ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
- ఈ ప్లాన్ తీసుకున్నవారికి బీఎస్ఎన్ఎల్ ఫిక్స్డ్ లైన్ కనెక్షన్ కూడా ఇస్తోంది. అయితే, టెలిఫోన్ పరికరాలను మాత్రం యూజర్లే కొనుక్కోవాల్సి ఉంటుంది. తొలి నెల ఫోన్ బిల్లులో 90 శాతం (గరిష్ఠంగా రూ.500) రాయితీ కూడా పొందొచ్చు.
- 300 ఎంబీపీఎస్ వేగంతో బీఎస్ఎన్ఎల్ మరో రెండు ప్లాన్లను కూడా అందిస్తోంది. అవే రూ.2,499, రూ.4,499 ప్లాన్లు. అయితే, వీటిలో ఓటీటీ ప్రయోజనం ఉండదు. కానీ, నెలకు వరుసగా 5టీబీ, 6.5టీబీ డేటా అందిస్తారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
APSRTC: విలీనంతో ఆశించిన ప్రయోజనాలేవీ?: ఆర్టీసీ సంఘాల ఆక్షేపణ
-
Crime News
Hyderabad News: ప్రిన్సిపల్ ఎదుటే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న విద్యార్థి
-
India News
ఆ విచారణ విరక్తి పుట్టించింది..అవమానంతో చితికిపోయా..!
-
General News
గాంధీ జీవన సందేశాన్ని అందుబాటులోకి తీసుకురావడం ప్రశంసనీయం: జస్టిస్ ఎన్.వి.రమణ
-
Movies News
Tamil rockerz Review: రివ్యూ: తమిళ్ రాకర్స్
-
Politics News
Rajasingh: మునావర్ కామెడీ షో అడ్డుకుంటామన్న రాజాసింగ్.. అరెస్టు చేసిన పోలీసులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- మూడో కంటికి తెలియకుండా రెండు ఉద్యోగాలు.. ఇప్పుడు రిటైర్మెంట్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/08/2022)
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- China: వరుణాస్త్రం బయటకు తీసిన డ్రాగన్..! ఎందుకు..?
- Punjab: ₹150 కోట్ల స్కాం.. 11వేలకు పైగా యంత్రాలు మాయం!
- Trump: ట్రంప్ పర్యటనకు కేంద్రం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
- Arjun kapoor: అర్జున్.. ప్రజల్ని బెదిరించకు..నటనపై దృష్టి పెట్టు: భాజపా మంత్రి సలహా
- Sehwag - Akhtar: నిన్ను ఓపెనర్‌గా పంపించాలనే ఐడియా ఎవరిది..?