BSNL నుంచి అదిరిపోయే బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌.. 75 రోజులకు ₹275 మాత్రమే!

BSNL Broadband:  ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL బ్రాడ్‌బ్యాండ్‌ సేవలకు సంబంధించి సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది.

Published : 20 Aug 2022 10:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL బ్రాడ్‌బ్యాండ్‌ సేవలకు సంబంధించి సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. కొత్త వినియోగదారులను ఆకట్టుకోవడంలో భాగంగా రూ.275కే బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను ప్రకటించింది. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఆఫర్‌ను ప్రకటించింది. అయితే, తొలి 75 రోజుల వరకే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. అనంతరం ప్లాన్‌ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

BSNL ప్రకటించిన ఈ ఆఫర్‌ ప్రకారం.. కొత్తగా బ్రాడ్‌బ్యాండ్‌ తీసుకునే వినియోగదారులకు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఎంట్రీ లెవల్‌ ప్లాన్లు అయిన రూ.449, రూ.599కు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. తొలి 75 రోజుల పాటు ఈ ప్లాన్లు రూ.275కే అందిస్తారు. ఇక ప్లాన్ల వివరాల విషయానికొస్తే రూ.449 ప్లాన్‌పై 30 ఎంబీపీఎస్‌ వేగంతో 3.3 టీబీ నెలవారీ డేటా పొందొచ్చు. డేటా పరిమితి దాటాక వేగం 2 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. రూ.599 ప్లాన్‌పై 60 ఎంబీపీఎస్‌ వేగంతో 3.3 టీబీ డేటాను పొందొచ్చు. నెలవారీ పరిమితి దాటాక వేగం 2ఎంబీపీఎస్‌కు పడిపోతుంది.

దీంతో పాటు రూ.999 పైనా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇలాంటి ఆఫర్‌నే ప్రకటించింది. తొలి 75 రోజుల పాటు ఈ ప్లాన్‌కు రూ.775 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లో 150 ఎంబీపీఎస్‌ వేగంతో డేటా లభిస్తుంది. 2 టీబీ వరకు ఈ వేగాన్ని ఆనందించొచ్చు. ఈ ప్లాన్‌లో ఓటీటీ ప్రయోజనాలను కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తోంది. డిస్నీ+ హాట్‌స్టార్‌, హంగామా, సోనీలివ్‌, జీ5, వూట్‌, యుప్‌టీవీ, లయన్స్‌గేట్‌ ఓటీటీలు ఫ్రీగా లభిస్తాయి. ఈ ప్లాన్లన్నీ సెప్టెంబర్‌  13 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని బీఎస్‌ఎన్‌ఎల్‌ పేర్కొంది. మరిన్ని ప్లాన్ల వివరాల కోసం BSNL వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు