BSNL Prepaid Plans: కొత్త ప్లాన్ల పేరిట టారిఫ్‌లు పెంచేసిన బీఎస్ఎన్ఎల్!
బీఎస్ఎన్ఎల్ ఇటీవల ప్రవేశపెట్టిన మూడు ప్లాన్లు పాతవే అయినప్పటికీ.. వ్యాలిడిటీని మాత్రం తగ్గించారు...
ఇంటర్నెట్ డెస్క్: బీఎస్ఎన్ఎల్(BSNL) ఇటీవల మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. నిశితంగా పరిశీలిస్తే నిజానికి అవి పూర్తిగా కొత్తవి కావు. ఇంతకు ముందు కూడా ఈ ప్లాన్లను బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేసేది. కానీ, ప్రయోజనాలు మాత్రం భిన్నంగా ఉండేవి. ప్రస్తుతం, ఈ ప్లాన్లతో అందించే ప్రయోజనాలు ఇంతకు ముందు వినియోగదారులు పొందిన దానికంటే తక్కువగా ఉండటం గమనార్హం.
రూ.99 ప్రీపెయిడ్ ప్లాన్..
ఇంతకుముందు, బీఎస్ఎన్ఎల్ రూ.99 ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ 22 రోజులుగా ఉండేది. అపరిమిత వాయిస్ కాలింగ్‌తో వచ్చేది. కానీ ఇప్పుడు, అదే ప్లాన్ 18 రోజుల సర్వీస్ వ్యాలిడిటీ, అపరిమిత వాయిస్ కాలింగ్‌తో వస్తుంది. అంటే ఈ ప్లాన్‌కి రోజువారీగా చెల్లిస్తున్న ఖర్చు రూ.4.5 నుండి రూ.5.5కి పెరిగింది. కొత్త ప్లాన్‌లో ఇతర ఎలాంటి ప్రయోజనాలు లేకపోవడం గమనార్హం.
రూ.118 ప్రీపెయిడ్ ప్లాన్..
బీఎస్ఎన్ఎల్ నుంచి రూ.118 ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్, ఉచిత పీఆర్బీటీ సర్వీస్ అందించేది. కాలపరిమితి 26 రోజులు. ఎలాంటి ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండేవి కావు. రోజుకి 0.5 జీబీ డేటాను అందించేవారు. ఈ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ అవే ప్రయోజనాలతో వ్యాలిడిటీని 20 రోజులకు కుదించి తిరిగి ప్రవేశపెట్టింది. అంటే ఈ ప్లాన్ వినియోగానికి రోజు ఖర్చు రూ.4.53 నుంచి రూ.5.9కి పెరిగింది.
రూ.319 ప్రీపెయిడ్ ప్లాన్..
రూ.319 ప్రీపెయిడ్ ప్లాన్‌ను 75 రోజుల కాలపరిమితి, అపరిమిత వాయిస్ కాలింగ్, 300 ఎస్ఎంఎస్లు, 10జీబీ డేటాతో బీఎస్ఎన్ఎల్ అందించేది. దీని కాలపరిమితిని ఇప్పుడు 65 రోజులకు తగ్గించింది. కొత్త ప్లాన్‌తో అదనపు ప్రయోజనాలు మాత్రం ఏమీ లేవు. దీంతో ఆ ప్లాన్‌ని ఉపయోగించుకోవడానికి చేసే రోజువారీ ఖర్చు రూ.4.25 నుంచి రూ.4.90కి పెరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్‌లో సిక్స్‌లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్‌బర్గ్ గాలం?