BSNL ప్లాన్‌: 2జీబీ డేటా + 5 నెలలకుపైగా వ్యాలిడిటీ.. వెయ్యి రూపాయల్లోపే!

BSNL Prepaid plan: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ రోజుకు 2జీబీ డేటా ఐదు నెలలకు పైగా వ్యాలిడిటీతో వెయ్యి రూపాయల్లోపే ప్రీపెయిడ్‌ ప్లాన్‌ అందిస్తోంది.

Published : 10 Jan 2023 01:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: స్మార్ట్‌ఫోన్‌లో డేటా లేనిదే ఈ రోజుల్లో చాలామందికి రోజు గడవదు. వీడియో కంటెంట్‌కు ఆదరణ పెరిగిన నేపథ్యంలో రోజుకు 1జీబీ డేటా ఇప్పుడు ఏమాత్రం సరిపోవడం లేదు. అందుకే చాలా మంది 1.5 జీబీ, 2జీబీ ప్లాన్లను ఎంచుకుంటున్నారు. ఈ లెక్కన ఏ టెలికాం సంస్థ ప్లాన్‌లను పరిశీలించినా నెలకు రూ.200, రూ.250పైనే ఖర్చవుతుంది. మూడు నెలలకు రూ.750, ఆరు నెలలకు దాదాపు రూ.1500 పెట్టాల్సిందే. అయితే, ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) అంతకంటే తక్కువ ధరలోనే ప్రీపెయిడ్‌ ప్లాన్లను అందిస్తోంది. 5 నెలలకుపైగా వ్యాలిడిటీ, రోజుకు 2జీబీ డేటాను కేవలం వెయ్యి రూపాయల్లోపే ఇస్తోంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తున్న ఈ ప్రీపెయిడ్‌ ప్లాన్‌ ధర రూ.997. మొత్తం 160 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే ఐదు నెలల పైమాటే. రోజుకు 2జీబీ చొప్పున 320 జీబీ డేటా, అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, రోజుకు 100 ఉచిత ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. అంటే 1జీబీ డేటా కేవలం రూ.3.11లకే లభిస్తోంది. లాంగ్‌ ప్లాన్‌ కోసం చూస్తున్న వారు దీన్ని పరిశీలించొచ్చు. ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్‌ పలు చోట్ల 4జీ సేవలను అందిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా ఈ సేవలు మరింత విస్తరించనున్నాయి. వచ్చే ఏడాది 5జీ సేవలనూ తీసుకొస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఇటీవల వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని