BSNL Prepaid Plans: రూ.599తో అపరిమిత డేటా..BSNLలోని ప్రీపెయిడ్‌ ప్లాన్ల వివరాలు

డేటా విషయంలో బీఎస్‌ఎన్‌ల్‌ ప్లాన్లు యూజర్లను ఆకర్షించేలా ఉన్నాయి....

Published : 07 May 2022 17:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత టెలికాం రంగంలో ప్రైవేటు కంపెనీల హవా కొనసాగుతోంది. ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ సైతం వాటితో పోటీ పడుతూ తమ యూజర్లకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తోంది. ముఖ్యంగా డేటా విషయంలో బీఎస్‌ఎన్‌ల్‌ ప్లాన్లు యూజర్లను ఆకర్షించేలా ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అందిస్తున్న అధిక డేటాతో కూడిన  దీర్ఘకాల ప్రీపెయిడ్‌ ప్లాన్‌లు ఏంటో చూద్దాం..

📱 రూ.399 ప్లాన్‌లో రోజుకి 1 జీబీ డేటా, అపరిమిత కాల్స్‌తో పాటు రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. దీని వ్యాలిడిటీ 80 రోజులు. దీంట్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్స్‌, లోక్‌ధన్‌ కంటెంట్‌ను ఉచితంగా పొందొచ్చు.

📱 రూ.429 ప్లాన్‌లో రోజుకి 1 జీబీ డేటా, అపరమిత కాల్స్‌తో పాటు రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. దీని వ్యాలిడిటీ 81 రోజులు. దీంట్లో ఈరోస్‌నౌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సేవలకు అనుమతి ఉంటుంది.

📱 రూ.447 ప్లాన్‌లో 60 రోజుల వ్యాలిడిటీతో 100 జీబీ హైస్పీడ్‌ డేటాను అందిస్తున్నారు. ఈ పరిమితి దాటిన తర్వాత 80 కేబీపీఎస్‌తో ఉచితంగా ఇంటర్నెట్‌ సేవల్ని పొందొచ్చు. దీన్ని డేటా వోచర్‌గా పేర్కొన్నప్పటికీ.. అపరిమిత కాల్స్‌, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉన్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్స్‌, ఈరోస్‌నౌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సేవల్ని ఉచితంగా పొందొచ్చు.

📱 రూ.499 ప్లాన్‌లో 90 రోజుల వ్యాలిడిటీతో రోజుకి 2 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత కాల్స్‌ ఉంటాయి. దీంతో ఎలాంటి ఓటీటీ సభ్యత్వం రాదు.

📱 రూ.1498 ప్లాన్‌ పూర్తిగా డేటా వోచర్‌. దీంట్లో కేవలం డేటా మాత్రమే అందుబాటులో ఉంటుంది. మిగిలిన ఏ ప్రయోజనాలూ ఉండవు. రోజుకి 2 జీబీ డేటాను 365 రోజుల పాటు పొందొచ్చు.

📱 రూ.599 ప్లాన్‌ వర్క్‌ ఫ్రమ్‌ హోం ప్యాకేజీ. రోజుకి 5 జీబీ డేటా 84 రోజుల పాటు పొందొచ్చు. పరిమితి దాటిన తర్వాత 80 కేబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ను ఆనందించొచ్చు. అపరిమిత కాల్స్‌, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉంటాయి. ఇక రాత్రి 12:00 గంటల నుంచి వేకువజామున 5 గంటల వరకు అపరిమిత డేటాను ఉచితంగా పొందొచ్చు. జింగ్‌ స్ట్రీమింగ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఆనందించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు