BSNL: ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ తగ్గించిన బీఎస్‌ఎన్‌ఎల్‌

BSNL: తక్కువ ధరలో అందిస్తున్న ఓ ప్లాన్‌ వ్యాలిడిటీని బీఎస్‌ఎన్‌ఎల్‌ 35 రోజుల నుంచి 30 రోజులకు కుదించింది.

Published : 18 Jun 2024 12:24 IST

BSNL | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) రూ.88ల ప్లాన్‌ వ్యాలిడిటీని తగ్గించింది. గతంలో ఇది 35 రోజుల గడువుతో లభించింది. దాన్ని ఇప్పుడు 30 రోజులకే పరిమితం చేసింది. దేశవ్యాప్తంగా తమ కస్టమర్లకు 4జీ, 5జీ సేవలను అందించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈనేపథ్యంలోనే పలురకాల ప్లాన్ల ధరలను సవరిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయడుతున్నారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) రూ.88 ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. ఆన్‌-నెట్‌ కాల్స్‌పై నిమిషానికి 10 పైసలు, ఆఫ్‌-నెట్‌ కాల్స్‌పై నిమిషానికి 30 పైసలు ఛార్జ్‌ చేస్తుంది. ఎలాంటి డేటా ప్రయోజనాలు ఉండవు. దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో    ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. టెలికాం పరిశ్రమలో రూ.100 కంటే దిగువన చాలా తక్కువ ప్రీపెయిడ్‌ ప్లాన్లే ఉన్నాయి. ఉన్నవి కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి లభిస్తుండటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని